పూరీ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా అనీల్ పాడూరి డైరక్షన్ లో వస్తున్న సినిమా రొమాంటిక్. రొమాంటిక్ టైటిల్ తో యూత్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో కెతిక సర్మ హీరోయిన్ గా నటిస్తుంది. రిలీజ్ కు రెడీగా ఉన్న ఈ సినిమా థియేటర్ రిలీజ్ అవుతుందా లేక ఓటిటి రిలీజ్ అవుతుందా అన్న క్లారిటీ రాలేదు. ఆల్రెడీ జీ 5 నుండి ఫ్యాన్సీ ఆఫర్ రాగా దర్శక నిర్మాతలు ఈ సినిమాను ఓటిటి రిలీజ్ కు కన్ ఫాం చేస్తున్నారని తెలుస్తుంది.

ఆకాష్ పూరీ, కెతిక శర్మ ఇద్దరు సినిమాలో రొమాన్స్ అదరగొడతారని తెలుస్తుంది. పూరీ రొమాంటిక్ బేరం కుదిరిందని తెలుస్తుంది. రిలీజ్ దాదాపు కన్ ఫాం కాగా అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ ఎప్పుడన్నది మాత్రం తెలియాల్సి ఉంది. పూరీ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వస్తుందని తెలుస్తుంది. సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా కెతిక శర్మ ఉంటుందని అంటున్నారు.

పూరీ డైరక్షన్ లో మెహబూబా సినిమాతో హిట్ కొడతాడనుకున్న ఆకాష్సినిమా టార్గెట్ మిస్ అయ్యాడు. అయితే రొమాంటిక్ సినిమా మాత్రం అసలు నిరాశపరచకుండా ప్లాన్ చేస్తున్నారట. తప్పకుండా ప్రేక్షకులు మెప్పించేలా ప్లాన్ చేసారట. మరి ఈ సినిమా అయినా పూరీ తనయుడు హిట్ కొడతాడో లేదో చూడాలి. ఈ సినిమా తర్వాత పూరీ డైరక్షన్ లో ఆకాష్ పూరీ హీరోగా మరో సినిమా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. రొమాంటిక్ హిట్ పడితే నెక్స్ట్ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా తీసి తనయుడిని హీరోగా నిలబెట్టాలని చూస్తున్నాడు పూరీ.                                              

మరింత సమాచారం తెలుసుకోండి: