ఈ రోజులు ప్రేమ పెళ్లి చాలా సహజం. సెలబ్రెటీస్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. కలిసి సినిమాల్లో నటిస్తూ లొకేషన్ సెట్లో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న జంటలు ఉన్నారు. మరి ఆ నిజజీవితంలో కపుల్స్ అయినా రీల్ యాక్టర్స్ ఎవరో చూద్దాం.

 
1) కృష్ణ – విజయ నిర్మల: వీరిద్దరూ కలిసి అనేక సినిమాల్లో కలిసి నటించారు. ఆ క్రమంలోనే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లయ్యాక సైతం వీరి ఆన్ స్క్రీన్ రొమాన్స్ చాల బాగా నడిచింది.

2) శ్రీకాంత్ – ఊహ: వీరిది చాలా మంది ప్రేమ వివాహం అనుకుంటారు కాని నిజానికి వీరిద్దరికి పెద్దలు కుదిర్చిన వివాహమే. ఇద్దరు కలిసి తెర మీద మంచి జంట గా కనిపించి నిజజీవితంలో కూడా సూపర్ జోడి అనిపించుకుంటున్నారు.

3) రాజశేఖర్ – జీవిత: మొదట శత్రువులుగా కొట్లాడుకున్నా వీరిద్దరూ ఆ తర్వాత మిత్రులుగా, తదనంతరం ప్రేమికులుగా మారిపోయారు. ‘తలంబ్రాలు’ ‘అంకుశం’ వంటి చిత్రాల్లో కలిసి నటించి ఇప్పుడు నిజ జీవితంలో సైతం కలిసి బ్రతుకుతున్నారు.

4) నాగార్జున – అమల: ‘నిర్ణయం’ సినిమాలో ప్రేమలో పడ్డ ఈ జంట పెళ్లి చేసుకొని ఇప్పటికి బ్యూటిఫుల్ కపుల్ గా చలామణి అవుతున్నారు.  

5) మహేష్ బాబు – నమ్రత: ఈ సూపర్ క్యూట్ కపుల్ వంశి సినిమా సమయంలో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత అత్యంత సన్నిహితుల మధ్య పెళ్లి చేసుకోం హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు.

6) శివ బాలాజీ – మధుమిత: ఒక తమిళ్ సినిమా షూటింగ్ లో ప్రేమలో పడ్డ ఈ జంట పెళ్లి చేసుకొని నిజజీవితంలో జంటగా మారిపోయారు.

7) వరుణ్ సందేశ్వితిక షెరు: పడ్డానండీ ప్రేమలో సినిమా టైములో నిజంగానే ప్రేమలో పడ్డారు వీరిద్దరూ. ఆ తర్వాత ఎప్పుడు ఒకరి ప్రేమలో మరొకరు పడుతూనే ఉన్నారు.

8) నాగ చైతన్య – సమంత: వీరి గురించి ఎంత చెప్పిన తక్కువే. ఏమాయ చేసావే సినిమా చేసిన ఈ జంట ఒకరి మాయలో ఒకరు పడి టాలీవుడ్ సెన్సేషనల్ గా నిలిచారు.

9) పవన్ కళ్యాణ్ – రేణు దేశాయ్: చేసిన ఒకే ఒక్క సినిమాతో పవన్ కళ్యాణ్ ప్రేమలో పడింది రేణు దేశాయ్. కొన్నాళ్ల పాటు సహజీవనం చేసి పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలు పుట్టాక విడాకులు తీసుకున్నారు.

10) ఆర్య – సయేషా సైగల్: అఖిల్ చిత్రంలో నటించిన ఈ భామ తమిళ్ సూపర్ స్టార్ ఆర్యతో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. గత ఏడాది వీరి పెళ్లి వైభవంగా జరిగింది.

11) సూర్య – జ్యోతిక:  కాకా కాకా చిత్రం చేస్తున్న సమయంలో ఈ జంట మధ్య ప్రేమ పుట్టింది. ఇక సౌత్ ఇండియన్ బెస్ట్ కపుల్ గా అదరగొట్టేస్తున్నారు ఈ జంట.

మరింత సమాచారం తెలుసుకోండి: