బిగ్ బాస్ సీజన్ 4 చివరి వారాల్లో ఆట ఆసక్తికరంగా ఉండగా ఇలాంటి టైం లో షో టైమింగ్ ను ఛేంజ్ చేస్తున్నారని తెలుస్తుంది. ఈ సీజన్ బిగ్ బాస్ షోలో ఎన్నో మార్పులు జరిగాయి. బిగ్ బాస్ షో వీక్ డేస్ లో అంటే మండే టూ ఫ్రై డే రాత్రి 9:30 నిమిషాలకు టెలికాస్ట్ అవుతుంది.. వీకెండ్ లో మాత్రం 9 గంటలకు వస్తుంది. అయితే డిసెంబర్ 7 నుండి రాత్రి 10 గంటలకు బిగ్ బాస్ వస్తుందని తెలుస్తుంది. 9:30 గంటలకు వదినమ్మ సీరియల్ వస్తుందని తెలుస్తుంది.

అసలైతే ప్రైం టైం 7 గంటలకు వస్తున్న వదినమ్మ సీరియల్ ను తొమ్మిదిన్నరకు మార్చారు. అయితే 7 గంటల టైం లో గుప్పెడంత మనసు అనే కొత్త సీరియల్ ను స్టార్ట్ చేస్తున్నారు. డిసెంబర్ 7 నుండి ఈ సీరియల్ స్టార్ట్ అవుతుంది. అయితే డిసెంబర్ 20న బిగ్ బాస్ ముగుస్తుంది.. అందుకే షో టైమింగ్స్ మార్చినట్టు తెలుస్తుంది. ఎలాగు ఆడియెన్స్ కనెక్ట్ అయ్యారు కాబట్టి షో లేట్ అయినా ప్రాబ్లెం ఏమి ఉండదు.

సో డిసెంబర్ 7 నుండి రాత్రి 10 గంటల నుండి 11 గంటల వరకు బిగ్ బాస్ షో వస్తుంది. అయితే వీకెండ్ ఎపిసోడ్స్ మాత్రం ఎప్పటిలానే రాత్రి 9 గంటలకు వస్తాయని తెలుస్తుంది. మరి ఈ టైమింగ్ లో మార్పులు బిగ్ బాస్ వ్యూయర్స్ మీద ఏమేరకు ఎఫెక్ట్ చూపిస్తాయో చూడాలి. మరి బిగ్ బాస్ సీజన్ 4 మూడు వారాలు ఎలాంటి రేటింగ్స్ తెస్తాయో చూడాలి.                                                    

మరింత సమాచారం తెలుసుకోండి: