ఇంతకుముందు రోజుల్లో అయితే ఒక సినిమా గురించి నెగటివ్ గా ఒక మాట చెప్పాలంటే భయపడేవారు. కానీ ఇప్పడు ట్రెండ్ మారిపోయింది. ఏదైనా సరే ఇప్పటి హీరోలు కుండా బద్దలు కొట్టేస్తున్నారు. తాము నటించిన సినిమాలు ఫ్లాప్ అంటూ అభిమానులను హర్ట్ చేస్తున్నారు.  అలా తాము చేసిన అట్టర్ ఫ్లాప్ చిత్రాల గురించి ఎలా ఒప్పుకున్నారో ఒకసారి చూద్దాం.

1) పవన్ కళ్యాణ్ మాట్లాడానికి చాల మొహమాట పడతాడు.కానీ తన జానీ, సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలు ఫ్లాప్ అని నిజాయితీగా ఒప్పుకొని ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చాడు.  
2) మహేష్ బాబు శ్రీమంతుడు ఆడియో ఫంక్షన్లో మాట్లాడుతూ నా సైనికుడు సినిమా వారం ఆడలేదని, ఆగడు వంటి సినిమాలో జన్మలో చేయని అంటూ వేదికపై చెప్పి అందరిని ఆశ్చర్యపరిచాడు.
3) నాని ఒక డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ కృష్ణార్జున యుద్ధం సినిమాని పెద్ద హిట్ అంటూ ప్రమోట్ చేస్తుంటే… ‘అంత లేదు బాబాయ్.. సినిమా సరిగ్గా ఆడలేదు.. కానీ మనసు పెట్టి తీసాం’ అంటూ సోషమ్ మీడియాలో ఒప్పుకొని సినిమా నిర్మాత సైతం ఖంగు తినేలా చేసాడు.
4) నాగార్జున,  ఆఫీసర్’ సినిమా డిజాస్టర్ అంటూ సోషల్ మీడియాలో ఒప్పుకున్నాడు. తన 25 ఇయర్స్ కెరీర్ లో దానంత వరెస్ట్ మూవీ లేదు అంటూ చెప్పాడు.
5) రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ అట్టర్ ఫ్లాప్ అంటూ నేరుగా ఒప్పేసుకున్నాడు.
6) రామ్ సైతం తన మొదటి సినిమా ‘జగడం’ ఫ్లాప్ అని మొహమాటం లేకుండా ఒప్పుకున్నాడు.
7) రవితేజ కి మాత్రం నిజంగానే మనసులో ఒక మాట బయటకు ఒక మాట ఉండడు. తాను నటించిన  ‘నిప్పు’ ‘దేవుడు చేసిన మనుషులు’ ‘కిక్ 2’ సినిమాలు ఫ్లాప్ అయ్యాయంటూ చాలా సందర్భాల్లో చెప్పుకున్నాడు.
8) నితిన్: భీష్మ ప్రమోషన్స్ సమయం లో ‘లై’ ‘ఛల్ మోహన్ రంగ’ ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమాలు ఫ్లాప్ అయ్యాయని ఒప్పుకున్నాడు.    
9) ఎన్టీఆర్  ‘టెంపర్’ ఆడియో  ఫంక్షన్లో తన గత సినిమాలతో అభిమానులను నిరాశ పరిచినందుకు సారీ చెప్పి… ఈసారి కాలర్ ఎగరేసుకునే సినిమా ఇస్తాను అని మాట కూడా ఇచ్చాడు.
10) విజయ్ దేవరకొండ లాంటి సెన్సేషన్ హీరో సైతం తన ‘నోటా’ సినిమా ఫ్లాప్ అని సోషమ్ మీడియాలో ద్వారా ఒప్పుకోక తప్పు లేదు.

ఈ సినిమాలు చేసినందుకు మన టాలీవుడ్ హీరోలు చాల బాధ పడ్డారట. మరొకసారి అభిమానులను నిరాశ పరచుము అంటూ ప్రామిస్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: