వెర్సటైల్ యాక్టర్ సూర్య హీరోగా మహిళా దర్శకురాలు సుధా కొంగర దర్శకత్వంలో ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ డెక్కన్ అధినేత అయిన జీఆర్ గోపీనాథ జీవితం ఆధారంగా తెరకెక్కిన లేటెస్ట్ సెన్సేషనల్ హిట్ మూవీ ఆకాశం నీ హద్దురా. సూర్య ఈ సినిమాలో మహా అనే పాత్రలో కనిపిస్తారు. ఇక మొదటి నుండి విభిన్న తరహా సినిమాలకు పెట్టింది పేరైన సూర్య, గతంలో ఈ విధంగా పలు ప్రయోగాత్మక సినిమాలు చేసినప్పటికీ అవి మాత్రం ఆయనకు కొంత ఆశించిన రేంజ్ సక్సెస్ ని అయితే అందివ్వలేదు.

ఇక ప్రస్తుతం రిలీజ్ అయిన ఈ సినిమా మాత్రం తనపై విమర్శలు చేసేవారందరికీ పెద్ద షాక్ ఇస్తూ బ్లాక్ బస్టర్ కొట్టడంతో సూర్య ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇటీవల ప్రముఖ ఓటిటి మాధ్యమం అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పటికే అందులో అత్యధిక వ్యూస్ అందుకున్న సినిమాగా గొప్ప రికార్డు ని సొంతం చేసుకున్నట్లు సమాచారం. అపర్ణ బాలమురళి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ప్రముఖ నటుడు మోహన్ బాబు కీలక పాత్రలో నటించారు. సూర్య నటిస్తూ సొంతంగా నిర్మించిన ఈ సినిమాని ఎంతో హృద్యంగా ఎక్కడా ప్రక్కదారి పట్టకుండా పక్కాగా స్క్రిప్ట్ మీదనే ఎంతో జాగ్రత్త వహిస్తూ తీసిన దర్శకురాలు సుధా కొంగర కనబరిచిన అద్భుత దర్శకత్వ ప్రతిభకు ప్రేక్షకులతో పాటు విమర్శకులు సైతం నీరజనాలు పడుతున్నారు.

ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఈ సినిమాపై పొగడ్తలు కురిపించగా, నిన్న తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా స్టార్ హీరోయిన్ సమంత ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ ఒక పోస్ట్ చేసారు. ఇది నిజంగా తన వంటి ఎందరికో మంచి ఆదర్శంగా నిలిచే సినిమా అని, నటుడు సూర్య, నటి అపర్ణ ల నటన సినిమాకి ప్రాణం అని సమంత తన పోస్ట్ లో తెలిపారు. ఇక ఇంతటి అద్భుత విజయం అందుకున్న సినిమాని తీసిన దర్శకురాలు సుధా తో పాటు యావత్ ఆకాశం నీ హద్దురా యూనిట్ మొత్తానికి ఆమె ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.......!!


మరింత సమాచారం తెలుసుకోండి: