పవన్ కల్యాణ్ కేంధ్రంగా సినీ సెలబ్రెటీలు వాదోపవాదలకు దిగుతున్నారు.ఇటీవల గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ ప్రకటించి,వెంటనే మళ్ళీ బి‌జే‌పి కి మద్దతు పలికాడు పవన్ కల్యాణ్.పవన్ ఇచ్చిన స్టేట్మెంట్  తో చాలా మంది చాలా రకలుగా విమర్శలు చేశారు.తమిళ మీడియా కూడా పవన్ పై సెటైర్ల వర్షం కురిపించింది.  అలాగే నటుడు ప్రకాష్ రాజ్ సైతం బీజేపీ, జనసేన కూటమి మీద అసహనంగా మాట్లాడారు..పవన్ పై ఘాటు వ్యాఖ్యలు చెయ్యడం సంచలనంగా మారింది..

 దీంతో ఆయన సోదరుడు, జనసేన పార్టీ నేత ప్రకాష్ రాజ్ మీద నిప్పులు చెరిగారు. ప్రకాష్ రాజ్ రాజకీయ డొల్లతనం గురించి మాట్లాడుతూ ముందు మనిషిగా తయారై తర్వాత పవన్ ను విమర్శించు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.దానికి ప్రకాష్ రాజ్ సైతం రియాక్ట్ అయ్యారు. గౌరవనీయులైన నాగబాబుగారికి, మీ తమ్ముడు మీద ఉన్న ప్రేమ నాకు అర్థం అయ్యింది. నాకు దేశం మీద ఉన్న ప్రేమని మీరు అర్థం చేసుకోండి. 

నాకు తెలుగు భాష వచ్చుకానీ మీ భాష రాదు అంటూ సమాధానం ఇచ్చారు.ఇంతలో బండ్ల గణేష్ కలుగజేసుకుని పవన్ కళ్యాణ్ మహోన్నతమైన వ్యక్తి, రాజకీయాలు ఎవరైనా చేసుకోవచ్చు రాజకీయాలు ఎవరైనా మాట్లాడుకోవచ్చు కాని వ్యక్తిత్వం గురించి పవన్ కళ్యాణ్ గురించి ఎవరు మాట్లాడినా నేను సహించను పవన్ కళ్యాణ్ నా దృష్టిలో నాకు ఎప్పటికీ దైవంతో సమానం అంటూ ప్రకాష్ రాజ్ ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. బండ్ల చేసిన ఈ వ్యాఖ్యలకు ప్రకాష్ రాజ్ ఎలాంటి సమాధానం ఇస్తారు.మరి ఈ వివాదం ఎంతవరకు వెళుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: