ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి....కరోనా వైరస్ ప్రభావం కేంద్ర ప్రభుత్వం దేశమంతటా లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో సినిమా థియేటర్ లు కూడా మూతపడ్డాయి. అందువల్ల వల్ల తీవ్రంగా నష్టపోయింది చిత్ర పరిశ్రమ. సుమారు ఏడు నెలల పాటు సినీ పరిశ్రమ మూతబడటంతో తీవ్ర ఆర్థిక నష్టం జరిగింది. షూటింగ్‌లు ఆగిపోవడం, థియేటర్లు మూతబడటంతో ఎంతో మంది సినిమా కూలీలు  ఉపాధిని కోల్పోవటం జరిగింది. అయితే, సినీ పరిశ్రమకు జరిగిన నష్టాన్ని ఇప్పుడు పూడ్చే ప్రయత్నం చేస్తున్నారు టాలీవుడ్ ప్రముఖులు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరిపి తమను ఆదుకోవాలని కోరారు. సీఎం కేసీఆర్ సైతం ఇటీవల తెలుగు సినీ పరిశ్రమపై వరాల జల్లు కురిపించారు.

ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి  కేసీఆర్.. సినిమా థియేటర్లు తెరుచుకోవడానికి అనుమతులు ఇస్తున్నట్టు ప్రకటించారు. అంతేకాకుండా, సినిమా టిక్కెట్లను సవరించుకునే వెసులుబాటును కూడా కల్పించారు. అయితే, థియేటర్లు తెరుచుకోవడానికి ప్రభుత్వం పెట్టిన నిబంధనలు యాజమాన్యాలకు అడ్డంకిగా మారాయి. ఎందుకంటే కరోనా వ్యాప్తిని అడ్డుకుంటూ 50 శాతం ఆక్యుపెన్సీతో మాత్రమే థియేటర్లు తెరవాలి. దీంతో ఇప్పటి వరకు తెలంగాణలో ఏ థియేటర్ తెరుచుకోలేదు.అయితే మొదటగా ఏఎంబీ సినిమాస్ డిసెంబర్ 4న తెరుచుకుంటోంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు భాగస్వామిగా ఉన్న ఏఎంబీ సినిమాస్ ఒకడుగు ముందుకేసి సినీ ప్రదర్శన మొదలుపెడుతోంది. మంగళవారం నుంచి టిక్కెట్ బుకింగ్ కూడా ప్రారంభించింది. మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ ఒక వీడియో మెసేజ్‌ను విడుదల చేశారు. ఏఎంబీ సినిమాస్ ప్రకటనతో సినీ ప్రేమికుల్లో ఉత్సాహం వచ్చింది. సినీ ప్రముఖులు కూడా పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. ఈ విధంగా సూపర్ స్టార్ మహేష్ బాబు ముందుకు వచ్చి పలువురికి ఆదర్శంగా నిలిచాడు. ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విశేషాలు తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: