ఇండియన్ సినిమా గురించి తెలిసిన వారికి షారుక్ ఖాన్ అనే పేరు ఖచ్చితంగా తెలిసి ఉంటుంది అందులో  ఆశ్చర్యపోవాలిసిన అవసరం లేదు.అయితే ఇప్పటికే కోల్కతా టీం ఓనర్ గా ఉన్న షారుక్ ఖాన్ మరో టీం ను కొనుక్కోనున్నారు. అమెరికా లో నిర్వహించే లాస్ ఏంజెల్స్ ఫ్రాంచైజ్ లా KNIGHT రైడర్స్ టీం ను కొన్నారు.ఐపీల్ తరహాలో నిర్వహించే ఈ లీగ్ లో ఆరు టీం లు అడనున్నాయి.

వాషింగ్టన్ డీసీ, చికాగో, డల్లాస్ మరియు లాస్ ఏంజెల్స్. ఇప్పటికే అమెరికన్ క్రికెట్ ఎంటర్ప్రైస్ సంస్థ ఈ టోర్నమెంట్ ని నిర్వహించే అధికారo తీసుకుంది. దాదాపు గా ఈ టోర్నమెంట్ 2022 వేసవి కాలం లో నిర్వహించనున్నట్లు ఇండియాలో జరిగే ఐపీల్ టోర్నమెంట్ ముగిసిన వెంటనే నిర్వహించాలని నిర్ణయించనట్లు తెలుస్తోంది. నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో షారుఖ్ ఖాన్ మాట్లాడుతూ తనకు అమెరికన్ లీగ్ లో ఆసక్తి ఉన్నట్లు తెలిపారు.

 ఎన్నో  సంవత్సరాల నుండి knight రైడర్స్ ముద్రను ప్రపంచ వ్యాప్తంగా విస్తరించాలని అనుకుంటున్నామని మరియు అమెరికా లో జరిగే క్రికెట్ టోర్నమెంట్ కావడంతో మరింత పేరు వస్తుందని అనుకుంటున్నామని షారుక్ ఖాన్ తెలిపారు. అలాగే యాక్టర్స్ కంపెనీ అమెరికాలో క్రికెట్ స్టేడియం లను నిర్మిచాలని అనుకుంటున్నట్లు సమాచారం. కోల్కతా knight రైడర్స్, మరియు రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ సీఈఓ వెంకీ మైసూర్ మాట్లాడుతూ అమెరికా లో తమ కంపెనీ ని విస్తృతంగా విస్తరించాలని క్రికెట్ గేమ్ లో తమ ముద్ర చూపాలని అనుకుంటున్నట్లు తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: