దిల్‌రాజు.. మైత్రీ మూవీ మేకర్స్‌.. హారిక హాసిని క్రియేషన్స్‌ ఒకేసారి మూడునాలుగు సినిమాలు నిర్మిస్తున్నాయి. ఎంత పెద్ద నిర్మాత అయినా.. ఎంతోకొంత అప్పు చేయాల్సిందే. కరోనా వలన ప్రతి సినిమా ఏడాది పాటు వెనక్కి వెళ్లిపోయింది. ఇలా.. పెట్టుబడిపై.. ఏడాది వడ్డీ కట్టాల్సిన పరిస్థితి. ఏడాది నుంచి ఇంట్రెస్ట్‌ కొండలా పెరిగిపోయింది.

చిరంజీవి ఆచార్య 40 శాతం షూటింగ్‌ అయ్యాక కోవిడ్‌ ఎంట్రీ ఇచ్చింది. మిగతా 60 శాతం షూటింగ్‌ కోసం  9 నెలలు వెయిట్‌ చేయాల్సి వచ్చింది. ఈ మధ్యనే రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలైనా.. వడ్డీ లెక్కలు వేసుకుంటే.. బడ్జెట్‌ 100 కోట్లు దాటిపోతుందట.

ఇక కెజిఎఫ్‌2 అయితే.. రీషూట్‌కు కూడా వెళ్లింది. కెజిఎఫ్‌ పాన్‌ ఇండియా వైడ్‌ హిట్‌ కావడంతో.. రెండో పార్ట్‌ బడ్జెట్‌ భారీగా పెంచారు. హిందీ మార్కెట్  కోసం ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చి సంజయ్‌దత్‌ను తీసుకున్నారు. ఇలా కెజిఎఫ్‌2 బడ్జెట్‌ ఊహకు అందనంతగా వెళ్లిపోయింది.

ఆచార్య.. ఆర్‌ఆర్‌ఆర్‌.. రాధే శ్యామ్‌ షూటింగ్‌ మధ్యలో వుండగా కోవిడ్‌ వచ్చి బడ్జెట్‌ పెంచితే.. ఎఫ్‌3  సెట్స్‌పైకి రాకుండానే.. బడ్జెట్‌ పెరిగిపోయింది. ఎఫ్‌2ను 30 కోట్లతో పూర్తిచేస్తే.. దాదాపు 80 కోట్లు కలెక్ట్ చేసింది. ఎఫ్ 3 దగ్గరకొచ్చేసరికి  బడ్జెట్టే 60 కోట్లకు వెళ్లిపోతోందట.  దీనికి కారణం ప్రధానంగా వెంకటేశ్‌.. వరున్‌తేజ్‌.. అనిల్‌ రావిపూడి రెమ్యునరేషనే కారణం.

ఎఫ్‌2 తర్వాత అనిల్‌రావిపూడి తీసిన 'సరిలేరునీకెవ్వరు' బాక్సాఫీస్‌ వద్ద 100 కోట్లు దాటింది. దీంతో అనిల్‌ రావిపూడి క్రేజ్‌ ఒక్కసారిగా పెరిగింది. దీనికి తగ్గట్టే రెమ్యునరేషన్ తీసుకుంటాడు. ఎప్‌2.. గద్దలకొండ గణేష్‌ హిట్‌తో వరుణ్‌తేజ్‌ క్రేజ్‌ పెరిగింది. 10 కోట్లకు పైగా డిమాండ్‌ చేస్తున్నాడట. వెంకటేశ్‌ కూడా 10 కోట్లకు పైగా వున్నాడు. ఇలా హీరోలు.. దర్శకుడి రెమ్యునరేషనే 35 కోట్లు దాటిపోయింది. ఓవరాల్‌గా ఎఫ్‌3 బడ్జెట్ 60 కోట్లు క్రాస్‌ చేస్తుంది. మొత్తానికి కరోనా తెలుగు సినిమా బడ్జెట్‌ ను అమాంతం పెంచేసింది.





మరింత సమాచారం తెలుసుకోండి: