2020 త్రివిక్రమ్‌దే. అల వైకుంఠపురంలో సినిమాతో నాన్‌ బాహుబలి రికార్డ్‌ను సెట్ చేశాడు. బాహుబలి తర్వాత 150 కోట్లు దాటిన సినిమా ఇదే. అదిరిపోయే రికార్డ్‌ సొంతం చేసుకున్నా... త్రివిక్రమ్‌  ఓ విషయంలో మాత్రం వెనుకపడిపోయాడు. తోటి దర్శకులందరూ దూసుకుపోతుంటే.. త్రివిక్రమ్‌ ఎందుకు అటుగా అడుగులు వేయలేకపోతున్నాడు.

తెలుగులో సక్సెస్‌ పర్సెంటేజ్‌ ఎక్కువున్న దర్శకుల్లో త్రివిక్రమ్‌ ఒకడు. అజ్ఞాతవాసి మినహాయిస్తే.. ప్రతి సినిమాతో అలరిస్తూనే ఉన్నాడు. ఆయన కథలన్నీ ఫ్యామిలీ చుట్టూ తిరిగినా.. కథనంతో, మాటలతో మాయ చేస్తూ... మెప్పిస్తాడు త్రివిక్రమ్. అందుకే.. తెలుగులో స్టార్‌ డైరెక్టర్స్ పేరు చెప్పమంటే.. టాప్‌ త్రీలో త్రివిక్రమ్‌ పేరు కూడా వినిపిస్తుంది.

తెలుగు ప్రేక్షకులను ఇంతలా అలరిస్తున్న త్రివిక్రమ్ పాన్‌ ఇండియా మూవీస్‌పై ఫోకస్‌ పెట్టలేకపోతున్నాడు. బాహుబలి మూవీతో రాజమౌళి పాన్‌ ఇండియాకు తెరలేపాడు. చిరంజీవితో సురేంద్రరెడ్డి తీసిన సైరా ఇలాంటి చిత్రమే. విజయ్‌దేవరకొండతో పూరీ  తీసే సినిమా కూడా పాన్‌ ఇండియానే. పుష్ఫతో సుకుమార్‌ ఇండియా వైడ్‌ పాపులర్‌ కావాలనుకున్నాడు. ఇలా దర్శకులందరూ పాన్‌ ఇండియావైపు అడుగులు వేస్తుంటే. త్రివిక్రమ్‌ మాత్రం... తెలుగు ప్రేక్షకులకే పరిమితమవుతున్నాడు.

అల వైకుంఠపురంలో తర్వాత త్రివిక్రమ్‌ ఎన్టీఆర్‌ను డైరెక్ట్ చేస్తున్నాడు. ఫిబ్రవరిలో రెగ్యులర్‌ షూటింగ్ మొదలవుతుంది. సినిమాకు 'అయిననూ పోయి రావలె హస్తినకు' అన్న టైటిల్‌ పరిశీలిస్తున్నారు. టాలీవుడ్‌ పరిధి దాటకుండా కథలు రాసుకున్న ఈ దర్శకుడు... ఎన్టీఆర్‌ మూవీతో అయినా.. తన కలానాకి.. టేకింగ్‌కు పాన్‌ ఇండియా పవర్‌ వుందని నిరూపిస్తాడో లేదో చూడాలి.

మొత్తానికి త్రివిక్రమ్ 2020లో తన టాలెంట్ ఏంటో చూపించేశాడు. ఈ ఏడాది తనను మించిన డైరెక్టర్ ఎవరూ లేరనేలా సక్సెస్ సాధించేశాడు. అల వైకుంఠపురం లో సినిమాతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రను వేసుకున్నాడు.  బాహుబలి తర్వాత అంతటి క్రేజ్ సంపాదించుకున్న సినిమాగా అల వైకుంఠపురం లో రికార్డుల కెక్కింది. చూద్దాం.. 2021లో ఆయన ఎలా టాలెంట్ చూపిస్తాడో.





మరింత సమాచారం తెలుసుకోండి: