ఒక సినిమా ఫ్లాప్‌ అయితే.. కనిపించకపోవడం... వరుసగా డిజాస్టర్స్‌ అయితే.. కెరీర్‌ అయిపోయినట్టేనని భావిస్తే.. ఫ్లాప్‌లో కాలేసినట్టే. హీరోయిన్స్‌ విషయంలో ఫేడౌట్‌ అనే మాటకు చోటే లేదు. తెలుగు కాకపోతే.. మరో భాషను ఓన్‌ చేసుకుంటున్నారు. ఒక వేళ అన్ని ఇండస్ట్రీలు బాయ్‌కాట్ చేస్తే.. సైడ్‌ ఇన్‌కంకు దారులున్నాయి. ఏదో ఒక రూపంలో బిజీనే.  ఇలా ఫేడౌట్‌ అనే మాట నుంచి చాలా మంది ముద్దుగుమ్మలు బయటపడ్డారు.

మరక కూడా మంచికే అన్నట్టు.. బాలీవుడ్‌ డ్రగ్స్‌ వ్యవహారంలో రకుల్‌ పేరు వినిపించింది. ఇందులో నిజం లేదని తేలినా. ఆ మరక మాత్రం అలా ఉండిపోయింది. అయితేనేం బాలీవుడ్‌లో వరుస ఆఫర్స్‌తో పాగా వేసేసింది రకుల్‌. తెలుగులో చెక్‌ మూవీలో నితిన్‌తో.. క్రిష్‌ మూవీలో వైష్ణవ్‌తేజ్‌తో జత కడుతూనే హిందీ బంపర్‌ ఆఫర్స్‌ అందుకుంది.

అజయ్ దేవగణ్‌ మెగాఫోన్‌ పట్టిన ఫస్ట్‌ మూవీ 'మేడే'లో రకుల్‌  నటిస్తోంది. అలాగే 'ఎటాక్' మూవీలో జాన్‌ అబ్రహాంతో జత కట్టింది.  'సిమ్లా మిర్చి'లో హేమమాలిని కూతురుగా.. నటిస్తోంది. రారండోయ్‌ వేడుక చూద్దాం తర్వాత హిట్‌ లేని రకుల్‌ ఫేడౌట్ అయిపోయిందనుకున్నారు. కానీ బిజీగా గడిపేస్తోంది ఈ ఫ్లాప్‌  హీరోయిన్.

‌ రాశీఖన్నా తన ఏడేళ్ల కెరీర్‌లో తెలుగులో దాదాపు పాతిక సినిమాలు చేసింది. వీటిలో ఐదు మాత్రమే హిట్‌ అయ్యాయి. ఊహలు గుసగుసలాడే.. సుప్రీమ్‌.. జై లవకుశ... తొలిప్రేమ.. ప్రతిరోజు పండుగే... హిట్టయినా.. ఈ అమ్మడి సక్సెస్‌ పర్సెంటేజ్‌ చాలా తక్కువ. ఈ అమ్మడిపై ఫ్లాప్‌ హీరోయిన్‌ ముద్ర పడినా..ఆఫర్స్‌ మాత్రం తగ్గలేదు. యంగ్‌ హీరోలకు మెయిన్‌ ఆప్షన్‌గా మారింది. ప్రస్తుతం తెలుగు సినిమాలు చేయకపోయినా.. తమిళంలో నాలుగు సినిమాలు చేస్తూ  బిజీగా ఉంది రాశి.

మొత్తానికి హీరోయిన్ లు ఏ మాత్రం ఖాళీగా లేరు. ఏదో ఒక వ్యాపారం చేసుకుంటూ బిజీబిజీగా ఉన్నారు. తమ క్రేజ్ ఏంటో చూపించేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: