దిల్‌రాజు నిర్మిస్తున్న ఎఫ్3 బడ్జెట్‌ పెరుగుతోంది. ఎఫ్‌2లో ఇద్దరే హీరోలు. ఈ ఫ్రాంచైజీస్‌ సిరీస్‌లో రూపొందే రెండో సినిమా ఎఫ్ 3 లో ముగ్గురు హీరోలు. అతనెవరో ఎనౌన్స్‌ చేయకపోయినా.. క్రేజీ హీరో ఉంటాడని అనిల్‌ రావిపూడి తెలిపాడు. ఆ హీరోతోపాటు.. ఉన్న హీరోలు కూడా రెమ్యునరేషన్ పెంచేశారట. దీంతో ఎఫ్‌3 బడ్జెట్‌ ఎంత పెరుగుతుందో తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం.

2019  సంక్రాంతి నాడు రిలీజైన  ఎఫ్‌2 సంక్రాంతి రేసులో విజేతగా నిలిచింది. 30 నుంచి 40 కోట్లు లాభం తీసుకొచ్చింది ఎఫ్‌2. ఎండింగ్‌లోనే.. ఎఫ్‌3 అన్నటైటిల్‌ వేసి.. సిరీస్‌లో భాగంగా మరో మూవీ తీస్తామని ముందే చెప్పేశాడు దర్శకుడు. ఎఫ్‌3లో మూడో హీరోగా స్టార్‌ వుంటాడని ప్రచారం కూడా జరిగింది. మహేశ్‌ .. రవితేజా పేర్లు వినిపించాయి. ఈలెక్కన అదనంగా ఒక హీరో రెమ్యునరేషన్‌ పెరుగుతోంది. ఆల్ రెడీ వరుణ్‌ తేజ్‌ తన పారితోషికం పెంచేశాడట.

వెంకటేశ్‌.. తమన్నా.. మెహ్రీన్‌ రెమ్యునరేషన్ లో పెద్దగా మార్పు ఉన్నా లేకపోయినా.. బడ్జెట్‌పై భారం తక్కువే.  అయితే.. ఎఫ్‌2 తర్వాత అనిల్‌రావిపూడి తీసిన 'సరిలేరునీకెవ్వరు' బాక్సాఫీస్‌ వద్ద 100 కోట్లు దాటింది. దీంతో అనిల్‌ రావిపూరి క్రేజ్‌ ఒక్కసారిగా పెరిగింది. దీనికి తగ్గట్టే రెమ్యునరేషన్ తీసుకుంటాడు కాబట్టి.. ఎఫ్‌3 బడ్జెట్‌ మరో 5  కోట్లు పెరుగుతుంది.

ఎఫ్‌2 బడ్జెట్‌తో సంబంధం లేకుండా ఎఫ్‌3 తెరకెక్కనుంది. వెంకటేశ్‌.. వరుణ్ ‌తేజ్‌తోపాటు మూడో హీరో వచ్చాడు. వీళ్లతోపాటు.. దర్శకుడి రెమ్యునరేషన్‌ పెరిగింది. అనిల్‌ రేంజ్‌కు తగ్గట్టు మేకింగ్‌ కూడా కాస్ట్‌లీగా ఉంటుంది. ఎఫ్‌2ను 32 కోట్లకు అమ్మితే... దాదాపు 80 కోట్లు తీసుకొచ్చింది. ఎఫ్‌ 3 బడ్జెట్టే 40-50  కోట్లకు చేరుతుందని అంచనా.  ఇది నిర్మాతకు కాస్త ఫస్ట్రేషనే అయినా.. ఫన్‌తో... ఎఫ్‌2ను మించి కలెక్ట్‌ చేస్తాడేమో చూడాలి. మొత్తానికి ఎఫ్ 3 బడ్జెట్ అమాంతం పెరిగిపోయింది.





మరింత సమాచారం తెలుసుకోండి: