వాళ్లిద్దరూ ఒకే రక్తం పంచుకొని పుట్టారు. ఇద్దరూ యాక్టింగే జీవితంగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. అదేమిటో గానీ.. ఈ ఇద్దరికీ ఒకే కాన్సెప్ట్‌ ఉన్న చిత్రాలు సక్సెస్‌ తీసుకొచ్చాయి. కెరీర్‌లో ఒకే రకమైన హిట్స్‌ అందుకున్న ఈ బ్రదర్స్‌.. క్యారెక్టర్‌ రుణం తీర్చేసుకుంటున్నారు.  

విజయ్‌ దేవరకొండ... ఆనంద్‌ దేవరకొండ. ముందుగా విజయ్‌ దేవరకొండ వెండితెరకు పరిచయమయ్యాడు. 'పెళ్లిచూపులు'తో  హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తమ్ముడు ఆనంద్‌ డెబ్యూమూవీ 'దొరసాని' ఫ్లాప్‌ అయినా.. రెండో సినిమా 'మిడిల్‌క్లాస్‌ మెలోడీస్‌' సక్సెస్‌ అయింది. అమేజాన్‌లో రిలీజైన ఈ చిన్న చిత్రం మిడిల్‌.. అప్పర్‌ అని తేడా లేకుండా.. అందరినీ ఆకట్టుకుంది. అదేమిటోగానీ.. ఈ బదర్స్‌ గరిట తిప్పితేగానీ.. హిట్‌ రాలేదు... గుర్తింపు దక్కలేదు.

పెళ్లిచూపుల్లో విజయ్‌ తనకు తెలిసిన కుకింగ్‌ విద్యతో మొబైల్‌ క్యాంటీన్‌ నడిపి హిట్‌ కొట్టాడు. ముంబయి  చెట్నీలో ఎక్స్‌పర్ట్‌ అయిన తమ్ముడు 'మిడిల్‌క్లాస్‌ మెలోడీస్‌'తో మెప్పించాడు. ఇలా అన్నదమ్ములిద్దరికీ ఫుట్‌  బేస్ట్‌ మూవీస్‌తో హిట్‌ కొట్టడం విశేషం. తమ్ముడైతే ఓ అడుగు ముందుకేసి..  ఫుడ్‌ బిజినెస్‌లోకి దిగాడు. స్నేహితులు నిర్వహిస్తున్న  'గుడ్‌ వైబ్స్‌ ఓన్లీ'అనే కేఫ్‌లో పార్టనర్‌ అయ్యాడు. మిడిల్‌ క్లాస్‌ మెలోడీస్‌ ద్వారా సంపాదించిన రెమ్యునరేషన్‌ను ఈ ఫుడ్‌ బిజినెస్‌లో ఇన్వెస్ట్ చేశాడు ఆనంద్‌.

తమ్ముడు పార్టనర్‌గా ఉన్న ఫుడ్‌ బిజినెస్‌ను అన్నయ్య ప్రమోట్‌ చేస్తున్నాడు. మిడిల్‌ క్లాస్‌ మెలోడీస్‌ సక్సెస్‌ను పంచుకోవాలనుకున్నానని.. ఈక్రమంలో వీకెండ్‌నాడు.. కేఫ్‌కు వచ్చిన వారి బిల్‌లో సగం తనే కడతానంటున్నాడు విజయ్‌. ఎవరి కెరీర్‌ వాళ్లదన్నట్టు.. తమ్ముడు సినిమాల్లో జోక్యం చేసుకోని విజయ్‌.. తమ్ముడు బిజినెస్‌ను ప్రమోట్‌ చేస్తున్నాడు. ఎంతైనా.. విజయ్‌ తొలి సక్సెస్‌ కూడా ఫుడ్ బేస్డ్‌ మూవీనే కదా. పెళ్లిచూపులు కోసం చేసిన వంటలను గుర్తుచేసుకున్నాడు.

మొత్తానికి దేవరకొ్ండ బ్రదర్స్ కు వంటకాలు కలిసొచ్చాయి. ఫుడ్ బేస్డ్ మూవీస్ తో వచ్చిన సినిమాలు మంచి ఫలితాన్నిచ్చాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: