యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ తనయురాలు శృతి హాసన్ ముందు మ్యూజిక్ కంపోజర్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోయిన్ గా టర్న్ తీసుకుంది. మొదట్లో కెరియర్ లో హిట్టు పడక కొద్దిగా వెనక్కి తగ్గిన శృతి హాస పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఆ సినిమా తర్వాత శృతి హాసన్ కు వరుస క్రేజీ ఆఫర్లు వచ్చాయి. అయితే తెలుగులో ఛాన్సులు వచ్చే టైం లో ఫారినర్ తో ప్రేమలో పడటం షూటింగ్ కు ఇబ్బంది కలిగించడంతో తెలుగులో శృతి హాసన్ కు అవకాశాలు తగ్గాయి.

అయితే తన లవర్ తో విడిపోయి కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన శృతి హాసన్ ఫైనల్ గా మళ్లీ తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తుంది. తెలుగులో ప్రస్తుతం రవితేజతో క్రాక్, పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ సినిమా చేస్తున్న శృతి హాసన్ తన నెక్స్ట్ సినిమాలు కూడా సైన్ చేసిందని తెలుస్తుంది. ఇక వరుస సినిమాలే కాదు తన ఫాలోవర్స్ ను కూడా ఆకట్టుకునేందుకు ఓ హాట్ పిక్ తో షాక్ ఇచ్చింది శృతి హాసన్.

ఇన్నాళ్లు అభినయానికి ప్రాధాన్యత ఇచ్చే పాత్రలు చేసిన అమ్మడు ఇక మీదట స్కిన్ షోకి సిద్ధమని హింట్ ఇచ్చినట్టు ఉంది. అందుకే శృతి ఇలా రెచ్చిపోతుందని అంటున్నారు మొత్తానికి శృతి హాట్ పిక్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. తప్పకుండా క్రాక్, వకీల్ సాబ్ సినిమాలతో మళ్లీ తెలుగులో శృతి హాసన్ టాప్ లేపేస్తుందని అంటున్నారు.                                                 

మరింత సమాచారం తెలుసుకోండి: