సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరిచయమైన తొలి సినిమా రాజకుమారుడు. కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రీతి జింతా హీరోయిన్ గా నటించగా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మహేష్ కి మామయ్య పాత్రల్లో నటించారు. అప్పట్లో ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ఇక ఆ తర్వాత కెరీర్ పరంగా ఎన్నో బ్లాక్ బస్టర్ విజయాలతో కొనసాగిన మహేష్ బాబు నటించిన అనేక సినిమాల్లో ప్రకాష్ రాజ్ విలన్ సహా పలు ఇతర కీలక పాత్రల్లో నటించారు.

ఆ విధంగా మహేష్ నటించిన పలు సక్సెస్ఫుల్ సినిమాల్లో ప్రధాన పాత్రల ని ప్రకాష్ పోషించారనే చెప్పాలి. ఇకపోతే ఇటీవల కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు, కియారా అద్వానీ జంటగా నటించిన పొలిటికల్ యాక్షన్ ఎంటర్ టైనర్ భరత్ అనే నేను సినిమాలో ప్రకాష్ రాజ్ విలన్ గా ఒక ముఖ్య పాత్రలో నటించారు. మొదటి నుంచి హీరో తండ్రికి అనుకూలంగా వ్యవహరిస్తూ ఒకానొక సమయంలో అతన్ని చంపేసి కుటిల రాజకీయాలను చేసే ప్రకాష్ రాజ్ ని చివరకు మహేష్ బాబు తుదిముట్టిస్తారు. ఇకపోతే ఈ సినిమా రిలీజ్ తర్వాత మంచి సక్సెస్ అందుకుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి జరిగిన ప్రీ రిలీజ్ వేడుకకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రత్యేక అతిథిగా విచ్చేసిన విషయం తెలిసిందే.

అయితే ఆ వేడుక జరిగిన సమయంలో మాట్లాడేందుకు స్టేజి ఎక్కిన ప్రకాష్ రాజ్ ని ఉద్దేశించి పలువురు ప్రేక్షకులు అలాగే అభిమానులు కొంత విమర్శలు చేయడంతో వెంటనే ప్రకాష్రాజ్ మాట్లాడకుండానే స్టేజి దిగిపోయారు. అయితే అదే విషయాన్ని ఇటీవల ప్రకాష్ రాజ్ ఒక ఇంటర్వ్యూ లో భాగంగా మాట్లాడుతూ భరత్ అనే నేను సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పలువురు ప్రేక్షకులు అలానే మహేష్ అభిమానులు నాపై విమర్శలు చేసినప్పటికీ నేను వాటిని  ఏమాత్రం లక్ష్యపెట్టకుండా అలానే అటువంటి ఆనందకరమైన వేడుకలో మహేష్ ఫ్యాన్స్ తో ఎటువంటి గొడవలు పెట్టుకోకూడదు అనే ఉద్దేశంతో సర్దుకుని స్టేజీ దిగిపోయానని, తన మనస్తత్వం అదేనని ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు. ఇక మొదటి నుంచి మహేష్ తో పాటు ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ లతో కూడా తనకు మంచి  అనుబంధం ఉందని ఆయన చెప్పడం జరిగింది......!!

మరింత సమాచారం తెలుసుకోండి: