బాలీవుడ్ బాక్సాఫీస్ బద్దలు కొడుతున్నాడు మన టాలీవుడ్ హీరో అల్లు అర్జున్..... ఇక్కడ అవుట్ అయినా... అక్కడ హిట్ టాక్ తో తెగ దూసుకుపోతోంది అతగాడి సినిమా. అప్పట్లో భారీ అంచనాల మధ్య రిలీజైన బన్నీ సినిమా "నా పేరు సూర్య" ఊహించని రీతిలో డిజాస్టర్ గా మిగిలింది. ఒక సోల్జర్ జీవితాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు దర్శకుడు వంశీ. అందులోనూ ఇది ఆయన మొదటి సినిమా కావడం వలన ఫుల్ ఫోకస్ తో రూపుదిద్దాడు... కానీ ఈ చిత్రం  తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యింది. అల్లు అర్జున్ సినిమాలలో అత్యంత డిజాస్టర్ గా నిలిచిన చిత్రం ఏదైనా ఉంది అంటే అది నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే చెప్పాలి.

అటు ఈ సినిమా దర్శకుడు కెరియర్ ని కూడా ఇరకాటంలో పడేసింది. మొదటి సినిమాకే ఫ్లాప్ టాక్ రావడంతో వంశీకి అవకాశాలు ఇవ్వడానికి హీరోలు ఆలోచించేలా చేసింది. ఆ రేంజ్ లో డిజాస్టర్ అందుకున్న ఈ చిత్రం.... బాలీవుడ్ సినీ ప్రేమికులకు మాత్రం స్టొరీ లైన్ తెగ నచ్చేసిందట. ఇప్పటికే హిందీ డబ్బింగ్ కి యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ సాధించగా... తాజాగా ఈ చిత్రాన్ని బాలీవుడ్ థియేటర్లలో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా హిట్ టాక్ తో హిందీ ప్రేక్షకులను ఆకర్షిస్తోంది.

సినిమా వలన అల్లు అర్జున్ కు అక్కడ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీగానే పెరిగింది. కరోనా టైం లో బాలీవుడ్ సినిమాలకి కూడా రానటువంటి కలెక్షన్లు ఈ చిత్రానికి వస్తున్నాయంటే... ఈ సినిమాతో అక్కడ బన్నీ ఇమేజ్ ఎంత పెరిగిపోయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇక్కడ మరో ప్లస్ పాయింట్ ఏంటంటే పుష్ప సినిమాతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వనున్న బన్నీకి... ఈ సినిమా రెస్పాన్స్ అడిషనల్ పాపులారిటీని తెచ్చిపెట్టింది. పుష్ప సినిమా కూడా ఇంతకుమించిన జోరుతో బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ అదరగొడుతుంది అని ఆశిస్తున్నారు అల్లు అర్జున్ అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి: