రాజశేఖర్ అంటే తెలియని వారు ఉండరు. ఈ పేరుని అభిమానులకు పెద్దగా పరిచయం చేయాలిసిన పని లేదు. యాంగ్రీ స్టార్ గా రాజశేఖర్ తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఈ క్యారెక్టర్ లో అయినా ఇట్టే ఒదిగిపోతాడు. అప్పట్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. తరవాత సినీ హీరోయిన్ జీవితను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. రౌద్రంతో, కోపంతో డైలాగ్ చెప్పాలంటే రాజశేఖర్ తరువాతనే ఎవరన్నా. ఎమోషనల్ డ్రామా పండించడంలో అయినా, పోలీస్ పాత్రలలో నటించాలన్న గాని కేరాఫ్ అడ్రెస్స్ మన రాజశేఖర్. అంతేకాదు ఎన్నో ఫ్యామిలీ మూవీస్ ను కూడా అందించారు.అయితే ఇప్పుడు రాజశేఖర్ హవా కొంచెం తగ్గిందనే చెప్పాలి. రాను రాను మెల్లగా  ఈయన్ని ప్రేక్షకులు కూడా మరిచిపోతున్నారు అనుకునే సమయంలో ఊహించని హిట్ ఇచ్చి..మళ్ళీ రాజశేఖర్ అంటే ఏంటో ప్రేక్షకులకు మళ్ళీ చూపించాడు.

గత మూడేళ్లలో ఈయన ‘పి.ఎస్.వి.గరుడవేగ’ ‘కల్కి’ వంటి చిత్రాల్లో నటించారు. వీటిలో ‘పి.ఎస్.వి.గరుడవేగ’ సూపర్ హిట్ గా నిలిచింది. అయితే రాజశేఖర్ గారు  అప్పట్లో ఒక స్టార్ హీరోగా కొనసాగుతున్న సమయంలో.తన  కెరీర్లో కొన్ని సూపర్ హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నారు. ఆ సినిమాలే కనుక రాజశేఖర్ చేసి ఉన్నట్లయితే ఆయన  రేంజ్ ఇంకోలా ఉండేది.. మరి రాజశేఖర్ దాక వచ్చి, తాను వద్దు అనుకున్న ఆ సినిమాలు ఏంటో చూద్దాం.. ! రాజశేఖర్ మిస్ చేసుకున్న సినిమాల్లో ఠాగూర్  సినిమా కూడా ఒకటి. అప్పట్లో డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వల్ల ఈ కథను రాజశేఖర్ గారు వదులుకున్నారు.తరువాత మెగాస్టార్ తో వినాయక్ ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. ఈ చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పక్కర్లేదు.అలాగే రాజశేఖర్ వద్దు అనుకున్న మరొక సినిమా  జెంటిల్మెన్. అర్జున్ యొక్క మార్కెట్ ను అమాంతం  పెంచిన సినిమా ఇది. అప్పట్లో డైరెక్టర్ శంకర్సినిమా కోసం మొదట రాజశేఖర్ గారినే సంప్రదించారు. కానీ అప్పుడు ఆయన వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో చేయలేకపోయారట.

తరువాత అర్జున్ తో ఈ సినిమా తీశారు. మంచి హిట్ అయింది ఈ సినిమా.. అలాగే బాలకృష్ణ నటించిన లక్ష్మీ నరసింహాసామి సినిమాను బాలయ్య బాబు కంటే రాజశేఖర్ గారిని ముందు అడిగారట కానీ అది  కూడా రాజశేఖర్ గారు మిస్ చేసుకున్నారు.అలాగే నేనే రాజు నేనే మంత్రి సినిమా రానా కెరీర్లో సూపర్ హిట్ గా నిలిచింది. దీనికి కూడా మొదటి ఛాయిస్ రాజశేఖర్ గారే..! అయితే దర్శకుడు తేజకు క్లైమాక్ లో కొన్ని మార్పులు చెయ్యమని కోరారట రాజశేఖర్. మన తేజ గారి  గురించి తెలిసిందే కదా.ఆయన చెప్పిందే కధ.. ఎవరి మాట వినరు. అలా రాజశేఖర్ అనేటప్పటికీ తేజ కూడా ఆయనతో సినిమా వద్దు అనుకున్నారట.  తరువాత హనుమాన్ జంక్షన్ సినిమా.  మొదట ఈ చిత్రాన్నిమోహన్ బాబు, రాజశేఖర్ ల తో ప్లాన్ చేశారు. కానీ ఇద్దరూ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో చెయ్యలేకపోయారు.అలాగే చంటి సినిమా కూడా రాజశేఖర్  వరకు వెళ్లి వద్దు అనుకున్న సినిమానే. వెంకటేష్ గారిలోని అద్భుతమైన నటుడిని బయటకు తీసింది ఈ చిత్రం. కానీ ఆయన రిజెక్ట్ చేశారు. పై సినిమాలు కనుక రాజశేఖర్ చేసినట్లయితే ఆయన క్రెజ్ మరింత పెరిగేది కదా.. !!

మరింత సమాచారం తెలుసుకోండి: