RRR. యావత్ సినీ ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. పీరియాడికల్ ఫిక్షన్ మూవీ గా వస్తున్న ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజు గా.. ఎన్టీఆర్ కొమురం భీమ్ గా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ హీరోలపరిచయ టీజర్లు వచ్చి యూట్యూబ్లో కనీవినీ ఎరుగని రీతిలో స్పందనను రాబట్టాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ కొమురం భీమ్ టీజర్ వచ్చి నెల రోజులు దాటుతున్న.. ఇంకా ఈ టీజర్ ఇప్పటికీ రికార్డు లను తిరగరాస్తుంది సోషల్ మీడియాలో. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అయితే మొదట ఈ సినిమాను జులై 30 2020 న విడుదల చేస్తామని అన్నారు.

మళ్ళీ కొన్ని కారణాల వల్ల..అది కాస్తా  జనవరి 8 2021కి వాయిదా పడింది.మరి కనీసం జనవరి 8 కి అయిన సినిమా విడుదల అవుతుందని అనుకుంటే.. ఎవ్వరూ ఊహించని విధంగా కరోనా వచ్చి అన్నింటినీ ఆపేసింది. అయినా ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకొని మరీ.. ఈ సినిమా షూటింగ్ ని చాలా వేగవంతంగా పూర్తి చేస్తూ వస్తున్నాడు రాజమౌళి. అయినా ఈ సినిమా విడుదల కావడానికి  మరికొంత సమయం పడుతుందని వార్తలొస్తున్నాయి. ఇటీవల జరిగిన షూటింగ్స్‌లో కూడా ప్రధానమైన యాక్షన్‌ సన్నివేశాలనే తెరకెక్కించారట మన జక్కన్న.ఇంకా రామ్‌చరణ్‌ ఆలియా లతో, ఎన్టీఆర్‌ ఒలివియాతో కలిపి చిత్రీకరణ జరపాల్సి ఉందట. అలాగే ఈ చిత్రానికి గ్రాఫిక్స్‌ పనులు ఎక్కువగా ఉండడంతో... కరోనా వల్ల గ్రాఫిక్స్‌ కంపెనీల ఉద్యోగులు కూడా లేకపోవడం వల్ల పనులు ఆగిపోయాయి.

 ఇటువంటి కారణాల రీత్యా ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ విడుదల ఆలస్యమవుతున్న కొద్దీ చరణ్‌, ఎన్టీఆర్‌ అభిమానుల్లోనే కాకుండా rrr సినిమా కోసం ఎదురుచూసే ప్రతీ ఒక్కరినీ ఈ వార్త నిరాశ కలిగిస్తోందని చెప్పుకోవచ్చు.మరోవైపు మన జక్కన్నసినిమా ఆలస్యం అవుతున్న తరుణంలో అభిమానుల్లో.. ఈ సినిమాపై ఆసక్తి తగ్గకుండా.. పెంచేందుకు సినిమాకి సంబంధించిన టీజర్లు, ట్రైలర్లు, మేకింగ్ వీడియోలనీ ఏదో ఒక విధంగా అప్డేట్స్ ఇస్తూ.. సినిమా పై అంచనాలను పెంచుతూ పోతాడానే వాదనలు కూడా ఇప్పుడు ఫిల్మ్  సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి.మరి మన రాజమౌళి ప్లాన్ వర్కౌట్ అవుతుందా..?లేదా?అనేది తెలియాలంటే కొద్ది రోజుల వరకు ఆగాల్సిందే...!!

మరింత సమాచారం తెలుసుకోండి: