ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...కొంతమంది ఉంటారు తమకు కొంచెం క్రేజ్ రాగానే ఇంస్టాగ్రామ్ లో ఫాలోవర్స్ పెరగగానే  వాళ్లంతా  గొప్పవాళ్ళు ఎవరు లేరనుకుంటారు. ఇప్పుడు అలాంటి వాళ్ళ కోవలోకి వచ్చాడు ప్రముఖ సింగర్ ఇంకా బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్.. తన కంపోజ్ చేసిన బేబీ సాంగ్ దారుణంగా ప్లాప్ అయిందనే ఫ్రస్ట్రేషన్ తోనేమో మనోడు ఏది పడితే అది వాగుతూ పలువురు ఆగ్రహానికి గురవుతున్నాడు. ఇప్పుడు అభిజిత్ విషయంలో పలు కామెంట్స్ చేసి అభి ఫ్యాన్స్ చేత తిట్ల పాలవుతున్నాడు. ఇక అసలు విషయానికి వస్తే.. ఓ ప్రముఖ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ‘నా ఫేవరెట్ కంటెస్టెంట్ అంటే మా అన్న నోయల్.. ఆయన ఎలాగూ బయటకు వచ్చేశాడు కాబట్టి.. ఉన్న వాళ్లలో అభిజిత్ నా ఫేవరేట్. సొహైల్, అరియానా ఇలా ఇద్దరు ముగ్గురు నా ఫేవరెట్ కంటెస్టెంట్స్‌గా ఉన్నారు.


వాళ్లకు నా సపోర్ట్ తప్పకుండా ఉంటుంది. అయితే వీళ్లలో విన్నర్ ఎవరూ అంటే మాత్రం అభిజిత్ కావొచ్చు. అభిజిత్ బిగ్ బాస్ సీజన్ 4 విజేత అవుతాడని అనిపిస్తుంది’ అని అప్పుడు చెప్పాడు రాహుల్ సిప్లిగంజ్.అయితే మళ్ళీ ఈరోజు ఏమైందో కాని  రాహుల్ సిప్లిగంజ్ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో షాకింగ్ పోస్ట్ షేర్ చేశాడు. ‘సొహైల్, అరియానాలకే తన మద్దతు అని ప్రకటిస్తూ.. పెర్ఫామెన్స్‌ని బట్టే మన సపోర్ట్ ఉంటుంది.. ఎవరు చెప్పినా నమ్మకండి.. బాగా ఆడేవాళ్లని, జన్యూన్‌గా ఆడేవాళ్లని సపోర్ట్ చేయండి.. నాకు సొహైల్, అరియానాలను టాప్ 2లో చూడాలని ఉంది. దమ్ము ఉంటే సపోర్ట్.. పనికిరానోళ్లని బయటకు తొయ్యండి’ అంటూ షాకింగ్ పోస్ట్ పెట్టాడు సొహైల్.అయితే ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు ఓ రేంజ్‌లో ట్రోల్ అవుతోంది. జన్యునిటీ గురించి నువ్ మాట్లాడుతున్నావా?? గత సీజన్‌లో నువ్ ఎలా గెలిచావో.. ఏం గేమ్ ఆడావో మాకు తెలియదా? అని ట్రోల్ చేస్తున్నారు.


నిన్నటి వరకూ అభిజిత్ విన్నర్ అవుతాడని చెప్పిన రాహుల్.. ఇప్పుడు సొహైల్, అరియానాలు టాప్‌లో ఉండాలని అనడమే కాకుండా పనికిరాని వాళ్లని భయటకు తోసేయండి అని అనడంతో అభిజిత్ ఫ్యాన్స్‌తో పాటు మిగిలిన కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు.ఇక అభిజిత్ ఫ్యాన్స్ అయితే రాహుల్ మీద సోషల్ మీడియాలో దండయాత్రకు దిగారు.అసభ్యకరమైన తిట్లతో దారుణంగా తిడుతున్నారు రాహుల్. ఇక రాహుల్ అయితే అనవసరంగా నోరు జారానేమోనని ఇప్పుడు తెగ ఫీల్ అవుతున్నాడట. దీంతో రాహుల్ కి వచ్చిన క్రేజ్ అంత గంగలో కలిసిపోయింది.. ఇలాంటి మరెన్నో బిగ్ బాస్ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...

మరింత సమాచారం తెలుసుకోండి: