నటి ఊర్వశి ..ఈ మధ్య కాలంలో చాలా సినిమాల్లో క్యారెక్టర్ నటిగా నటిస్తూ అందరికి సుపరిచితమే. కానీ ఈమె ఒకప్పుడు తిరుగులేని హీరోయిన్,. తమిళనాట సంచలన కథానాయిక. ఊర్వశి నటించిన అనేక సినిమాలు తెలుగులో సైతం డబ్ చేయబడ్డాయి.ఈమె అసలు పేరు కళా రంజని.  హీరోయిన్ గా కెరీర్ ఒక రేంజ్ లో చవిచూసి, వయసు మీద పడ్డాక సహాయక నటి పాత్రల్లో నటిస్తుంది. తనదైన కామెడీ టైమింగ్ తో సౌత్ ఇండస్ట్రీలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఊర్వశి ఇద్దరు అక్కయ్యలు కూడా హీరోయిన్స్ గా నటించి తర్వాతి రోజుల్లో క్యారెక్టర్ నటీమణులుగా చలామణి అయ్యారు. ఈమె తమ్ముడు నందు కూడా హీరో గా నటించినవాడే. కానీ దురదృష్ట వశాత్తు తన రెండవ అక్కను మరియు తమ్ముడిని పోగొట్టుకుంది.

అస్సలు విషయానికి వస్తే ఊర్వశి కెరీర్ బాగా ఉన్న సమయంలోనే సింగర్ కం యాక్టర్ అయిన మనోజ్ కె  జయన్ ని ప్రేమించి 2000, మే 2న పెళ్లాడింది. పెళ్లయిన ఏడాదికే ఒక కూతురు కూడా పుట్టింది. కానీ ఇక్కడే ఆమె జీవితం మరొక మలుపు తిరిగింది. మనోజ్ కె జయన్ కి కాస్త మద్యం తీసుకునే అలవాటు ఉండేది. అది కాస్త భార్య  ఊర్వశి కి అలవాటు చేసి ఇద్దరు కలిసి సరదాగా తాగేవారు. కానీ ఊర్వశి కొన్నాళ్ల తర్వాత సరదాగా మొదలెట్టిన మద్యం సీరియస్ అలవాటుగా మార్చుకుంది. మద్యం లేనిదే ఉండలేని పరిస్థితికి వచ్చేసింది. చివరికి కూతురిని చూడటం కూడా మానేసింది. ఆమెతో మద్యం మాన్పించలేక మనోజ్ విడాకుల కోసం కోర్ట్ కి వెళ్ళాడు.ఇక ఊర్వశి కూతురు సైతం తన తల్లి పచ్చి తాగుబోతు అంటూ కోర్ట్ లో చెప్పడం అప్పట్లో పెద్ద సంచలనం. చివరికి ఊర్వశి దగ్గరగా ఉండటానికి సైతం ఆమె కూతురు ఒప్పుకోలేదు. వాదోపవాదాలు విన్న జడ్జ్ 2008 లో విడాకులు మంజూరు చేసారు. ఆ తర్వాత  2013 లో బిల్డర్ శివప్రసాద్‌ను మరో వివాహం చేసుకొని ఒక కుమారుడికి జన్మను ఇచ్చింది. ఇలా కన్నా కూతురు చేత చి కొట్టించుకోవడం ఒక్క ఉర్వశికే చెల్లించింది.  


 

మరింత సమాచారం తెలుసుకోండి: