మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ అదిరిపోయే కాంబినేషన్ లో క్రేజీ మూవీగా వస్తున్న ఆచార్య సినిమా నుండి వచ్చే ప్రతి అప్డేట్ మెగా ఫ్యాన్స్ కు ఫుల్ మజా ఇస్తుంది. నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో చిరు సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో రాం చరణ్ కూడా స్పెషల్ రోల్ చేస్తున్నాడని తెలిసిందే. సినిమాలో మెగా ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలు ఉండేలా చూసుకున్నాడట డైరక్టర్ కొరటాల శివ.

ఆయన సినిమాల్లో ఏదో ఒక మెసేజ్ ఉంటుంది. అయితే సోషల్ మెసేజ్ సినిమా కదా అని తక్కువ చేయలేం మంచి మెసేజ్ తో పాటుగా ఆ హీరో ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలు ఉండేలా చూసుకుంటాడు. అందుకే మిర్చి నుండి భరత్ అనే నేను వరకు కొరటాల శివ తీసిన నాలుగు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. చిరు ఆచార్య సినిమాలో చిరు పాత్ర మాత్రమే కాదు రాం చరణ్ పాత్ర కూడా సర్ ప్రైజ్ చేస్తుందని అంటున్నారు.

సినిమాలో తండ్రీ కొడుకులు ఇద్దరు అదరగొడతారని తెలుస్తుంది. చిరు పాత్రకు ఈక్వల్ గా చరణ్ పాత్ర ఉంటుందని టాక్. అంతేకాదు సినిమాలో చరణ్ ఉన్న 30 నిమిషాలు మెగా ఫ్యాన్స్ కు ఫుల్ జోష్ వస్తుందని అంటున్నారు. ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ షూట్ లో ఉన్న చరణ్ ఈ సినిమా కోసం ఈ నెల చివరన డేట్స్ ఇచ్చినట్టు టాక్. ఆచార్య సినిమాను 2021 సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. సమ్మర్ లో పవర్ స్టార్ వకీల్ సాబ్ కూడా రిలీజ్ ప్లాన్ చేసినట్టు తెలిసిందే.                                              

మరింత సమాచారం తెలుసుకోండి: