బాలీవుడ్ లో ఒక సినిమా చేసి ఆ వెంటనే ఊహలు గుసగుసలాడే సినిమాతో పరిచయమైన అమ్మడు రాశి ఖన్నా. మొదట్లో యువ హీరోలతో జతకట్టిన ఈ అమ్మడు తన టాలెంట్ తో స్టార్ ఛాన్సులు అందుకుంది. ముఖ్యంగా మెగా హీరోలు మెచ్చిన భామగా రాశి ఖన్నా మెగా కాంపౌండ్ నుండి మంచి ఛాన్సులు వచ్చాయి. వరుణ్ తేజ్ తో తొలిప్రేమ, సాయి ధరం తేజ్ తో సుప్రీం, ప్రతిరోజూ పండుగే సినిమాలు చేసి హిట్ అందుకుంది రాశి ఖన్నా.

యువ హీరోలతో పాటుగా ఎన్.టి.ఆర్ లాంటి స్టార్ హీరోతో సినిమా చేసినా ఆమెకు లక్ కలిసి రాలేదు. ఈ ఇయర్ మొదట్లో విజయ్ దేవరకొండతో వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా చేసిన రాశి ఖన్నా ఆ సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు రాశి ఖన్నా కోలీవుడ్ మీద దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ఆల్రెడీ తమిళంలో సినిమాలు చేస్తున్న రాశి ఖన్నా లేటెస్ట్ గా చియాన్ విక్రం సినిమాలో అవకాశాన్ని అందుకుంది.

చూస్తుంటే తెలుగులో ఎలాగు అవకాశాలు సన్నగిల్లాయని కోలీవుడ్ మీద దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ఆల్రెడీ తెలుగులో ఓ మోస్తారు ఇమేజ్ తెచ్చుకుంది కాబట్టి రాశి ఖన్నా తమిళంలో ఛాన్సులు రావడం కామనే. అయితే అక్కడైనా సెలెక్టెడ్ సినిమాలు చేసి స్టార్ ఛాన్సులు అందుకుంటే బెటర్ అని అంటున్నారు. మరి అమ్మడు ఏం చేస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: