కన్నడ సూపర్ హిట్ మూవీ కె.జి.ఎఫ్ సీక్వల్ గా వస్తున్న సినిమా చాప్టర్ 2 భారీ అంచనాలతో వస్తుంది. మొదటి పార్ట్ ఎలాంటి అంచనాలు లేకుండా రాగా అయినా సరే సౌత్ ఇండస్ట్రీని షేక్ చేసి బాలీవుడ్ లో కూడా భారీ వసూళ్లు రాబట్టింది. కె.జి.ఎఫ్ సినిమా 250 కోట్ల దాకా వసూళు చేసింది. ఇక చాప్టర్ 2 అయితే ఆ రేంజ్ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాలో భారీ స్టార్ కాస్ట్ తో వస్తుంది.

ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న కె.జి.ఎఫ్ చాప్టర్ 2 సినిమా త్వరలో ఈ సినిమాకు సంబందించిన టీజర్ వస్తుందని తెలుస్తుంది. అయితే సీజన్ 2 సినిమా టీజర్ ను జనవరి 8న రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. టీజర్ ఆరోజే ఎందుకంటే కె.జి.ఎఫ్ స్టార్ బర్త్ డే కాబట్టి ఆరోజు చాప్టర్ 2 వస్తుందని అంటున్నారు. అయితే భారీ అంచనాలతో వస్తున్న చాప్టర్ 2 సినిమా టీజర్ తోనే సంబరాలు మొదలుపెట్టాలని చూస్తున్నారు.

సినిమా తప్పకుండా ప్రేక్షకుల అంచనాలను మించి ఉంటుందని చిత్రయూనిట్ చెబుతున్నారు. మరి కె.జి.ఎఫ్ చాప్టర్ 2 ఆశించిన స్థాయిలో ఉంటుందా లేదా అన్నది చూడాలి. 2021 సమ్మర్ తో ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ చాప్టర్ 2 తర్వాత ప్రభాస్ తో సలార్ సినిమా చేస్తున్నాడు.   

మరింత సమాచారం తెలుసుకోండి: