తన అభిమానులను సంతోషపెడుతూ ఎట్టకేలకు రాజకీయాల్లో ప్రవేశిస్తున్నానని నిన్న  అంటూ నిన్న రజనీకాంత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన వెలువడిన ఆ దగ్గర నుంచి ఆయన అభిమానులు గాల్లో తిరుగుతున్నారు ఇప్పటి దాకా ఆయన రాజకీయ ఎంట్రీ గురించి సరైన క్లారిటీ ఇవ్వలేదు అలాంటి ది ఏకం గా ఈనెల 31న తన రాజకీయ పార్టీ ప్రకటిస్తానని ఆయన పేర్కొనడంతో తమిళ రాజకీయ వర్గాల్లో పెను సంచలనం రేగింది. ఈ మేరకు ముందు ఒక ట్వీట్ చేసిన ఆయన అనంతరం ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాడు. ఈ ప్రెస్ మీట్ లో రాజకీయాలకు సంబంధించి పలు విషయాలను పంచుకున్న ఆయన తాను నటిస్తున్న సినిమా గురించి కూడా పేర్కొన్నాడు. 

శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అన్నాత్తే  సినిమా ఇంకా షూటింగ్ పూర్తి కావాల్సి ఉందని అని పేర్కొన్నాడు. దాదాపు 40 శాతం మేర షూటింగ్ మిగిలి ఉందని పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వచ్చే లోపు ఆ సినిమా పూర్తి చేయాల్సి ఉందని ఆయన పేర్కొన్నాడు, దీంతో ఆయన సినిమా ఇప్పట్లో ఉండదని భావిస్తూ వచ్చిన ఆయన అభిమానులకు మరో స్వీట్ షాక్ తగిలింది అని చెప్పవచ్చు. తాజాగా అందుతున్న సమాచారం మేరకు దర్శకుడు శివ తండ్రి మొన్నీమధ్యనే చనిపోయారు ఆయన దశదినకర్మ పూర్తయిన వెంటనే ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టేలా ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. 

ఈ నెల 15 నుంచి షూటింగ్ మొదలు పెట్టి వీలైనంత త్వరగా ముగించేయాలని భావిస్తున్నట్లు సమాచారం. మీనా, ఖుష్బూ, కీర్తి సురేష్, నయనతార, ప్రకాష్ రాజ్, సూరి, సతీష్ లాంటి నటులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. అయితే రజనీకాంత్ రాజకీయ పార్టీ ప్రకటనతో అనివార్యంగా ఈ సినిమాను పూర్తి చేయాల్సి వచ్చింది. దీంతో ఈ సినిమా ఈ నెల లేదా వచ్చే నెల మొదటి వారంలో పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక దర్బార్ సినిమా తర్వాత రజనీ నటిస్తున్న ఏకైక సినిమా ఇదే.. ఒకవేళ ఆయన రాజకీయాల్లో బిజీ అయితే సినిమాలకు దూరం అయ్యే అవకాశం కనిపిస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: