సౌత్ లో క్రేజీ డైరక్టర్ మురుగదాస్ తన సినిమాలతో సత్తా చాటుతున్నాడు. తీసేది తమిళ సినిమాలే అయినా అతని క్రేజ్ మాత్రం నేషనల్ వైడ్ గా ఉంటుంది. ఇక తెలుగు, హిందీ భాషల్లో కూడా మురుగదాస్ సినిమాలు చేశాడు. ప్రస్తుతం దళపతి విజయ్ తో ఓ సినిమా ప్లానింగ్ లో ఉన్న మురుగదాస్సినిమా తర్వాత తెలుగులో సినిమా చేస్తాడని తెలుస్తుంది. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో మురుగదాస్ సినిమా ఉంటుందని టాక్.

ఆర్.ఆర్.ఆర్ సినిమా తర్వాత ఎన్.టి.ఆర్ త్రివిక్రం తో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఉంటే మురుగదాస్ తో తారక్ సినిమా ఉండొచ్చని అంటున్నారు. మురుగదాస్ మార్క్ సినిమాలో యంగ్ టైగర్ హీరోగా చేసే ఆ సినిమా రేంజ్ వేరేలా ఉంటుంది. తప్పకుండా ఈ కాంబినేషన్ రికార్డులు సృష్టిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్.టి.ఆర్ తో మురుగదాస్ సినిమా కాంబో ఊహించుకుంటేనే అదుర్స్ అనిపిస్తుంది. ఇక ఇద్దరు కలిసి సినిమా చేస్తే ఆ లెక్క వేరేలా ఉంటుంది.

నవరసాలు పలికించగలిగే నందమూరి తారక రాముడితో మురుగదాస్ సినిమా చేస్తే ఆ సినిమా ఎలా ఉంటుంది. కచ్చితంగా ఆ సినిమా పాన్ ఇండియా ప్రాజెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. మరి ఈ సినిమా కేవలం వార్తలకే పరిమితం అవుతుందా లేక కార్యరూపం దాల్చుతుందా అన్నది చూడాలి. తారక్ మాత్రం ఆర్.ఆర్.ఆర్ తర్వాత పర్ఫెక్ట్ సినిమా ప్లానింగ్ తో ముందుకెళ్తున్నాడు. మురుగదాస్ తో మాత్రమే కాదు కె.జి.ఎఫ్ డైరక్టర్ ప్రశాంత్ నీల్ తో కూడా ఎన్.టి.ఆర్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ప్రభాస్ తర్వాత ప్రశాంత్ నీల్ తారక్ తోనే సినిమా చేస్తాడని తెలుస్తుంది.                                    



మరింత సమాచారం తెలుసుకోండి: