సినిమా రంగపు పాకుడు రాళ్ళపైకి ఎక్కే క్రమంలో జారిపోయిన సితార సిల్క్ స్మిత. ఆమె మండుస్తున్న కాగడా. దగా దగా మెరిసే తారాజువ్వ. చిన్న పిల్ల కాలువలా తన జీవితాన్ని మొదలుపెట్టి, అనంత సాగరం లో కలిసి, ఈదలేక ఓడిన అగ్ని జ్వాలా. అసిస్టెంట్ గా దారికి చేరిన మొగాడు, మోసగాడు అని తెలియక, అతడి దాష్టీకానికి గురై , నిజాలను దిగమింగుకోలేక, సమస్యలను ఒంటరిగా ఛేదించలేక సుడిగుండం చిక్కి అల్లాడిపోయింది.  చివరికి తన ఆఖరు మజిలీకి చేరుకుంది. ఇక సిల్క్ ప్రయాణంలో మొదటి నుండి అన్ని తానై ఉన్న ఏకైక మహిళా అన్నపూర్ణమ్మ. సిల్క్ ని చిన్నతనంలోనే దత్తత తీసుకుంది. పదేళ్ల వయసులోనే చిత్ర సీమపై మనసు పారేసుకుంది సిల్క్ స్మిత అలియాస్ విజయలక్షి.  ఆమె ఆశను గమనించిన ఆమె పెద్దమ్మ అన్నపూర్ణమ్మ, గుంటూరు నుండి సినిమా ప్రయాణం మొదలు పెట్టి చెన్నై వరకు ఆమెను చేర్చింది.  మధ్యలో ఎన్నో ఆటుపోట్లు, తరాలకు మేకప్ చేసింది, ఛాయాదేవి కి అసిస్టెంట్ గా,  పని మనిషిగా కూడా బ్రతికింది సిల్క్. ఆమెతో పాటు అన్నపూర్ణమ్మ ఇళ్లల్లో పాచి పనులు చేసింది. తాడికొండ లో ఒక షూటింగ్ జరుగుతుండగా అక్కడ అవకాశం కోసం అన్నపూర్ణమ్మ సిల్క్ స్మిత ఇద్దరు మూడు రోజుల పాటు పస్తు ఉన్నారు.

సిల్క్ స్మిత కి ఎలాగోలా అవకాశాలు వచ్చాయి, డబ్బు, పేరు, పలుకుబడి అన్ని వచ్చాయి. వాటితో పాటే చుట్టూ మోసగాళ్లు, ప్రేమ పేరుతో వాడుకునే వాళ్ళు , అవకాశం ఇస్తా అని పక్కలో చేరే పురుష పుంగవులు ఎక్కువయ్యారు. అన్ని అన్నపూర్ణమ్మ చూస్తూ కూడా ఆపలేకపోయింది. ఇద్దరు కలిసి చిన్న అద్దె ఇంటి నుండి పెద్ద ఇంటికి, చివరగా సొంత బంగ్లాకు చేరుకున్నారు. అన్నపూర్ణమ్మ సిల్క్ స్మిత కు ఏం కావాలో అన్ని దగ్గరుండి చూసుకునేది. ఒక్కోసారి సిల్క్ చిరాకు పడ్డ పల్లెత్తు మాట అనేది కాదు. చివరికి ఒక నడి వయస్కున్ని ప్రేమిస్తున్న అంటే కూడా సరే అంది. అతడిని అతడి పెళ్ళాం పిల్లలను ఇంట్లో తెచ్చి పెట్టిన తలూపింది కానీ వద్దు అని ఈనాడు చెప్పలేదు. ఒక వేల మొదటి తప్పు చేసిన రోజే సిల్క్ ని అన్నపూర్ణమ్మ వాదించి ఉంటె ఈ రోజు ఆమె మన మధ్యలో ఉండేది. మొదట్లో అన్ని అధికారాలు అన్నపూర్ణమ్మ చేతిలోనే ఉండేవి. కానీ మెల్లిగా ఇంటిని, డబ్బును, ఆస్తులను ఆ మొగాడు దోచేస్తుంటే అన్నపూర్ణమ్మ అడ్డు చెప్పలేదు. చివరికి సిల్క్ కూడా ఆ మైకం నుండి బయటకు రాలేదు. ఒక్కోసారి అన్నపూర్ణమ్మ అడ్డు చెప్పిన సిల్క్ వినే పరిస్థితిలో ఉండేది కాదు. ఒంటరితనాన్ని దూరం చేసిన అతడిని స్మిత బాగా నమ్మింది అందుకే మోసపోయింది. ఇక జీవితంలో చూడాల్సినవి అన్ని చూసాక, ఆమెను పెంచి పెద్ద చేసిన అన్నపూర్ణమ్మ వొళ్ళో తల పెట్టి బాగా ఏడ్చేది సిల్క్.  సిల్క్ తాను చనిపోవాలని నిర్ణయించుకున్న తర్వాత అన్నపూర్ణమ్మను వూరికి వెళ్లిరమ్మని చెప్పి పంపింది. ఆమె వచ్చేలోగా సిల్క్ తన కథను ముగించుకుంది. ఇలా సిల్క్ ప్రయాణంలో ఎవరికీ తెలియని బహుదూరపు బాటసారి అన్నపూర్ణమ్మ. సిల్క్ కన్ను మూసినా రోజు ఆమె పక్కన ఒక అన్నపూర్ణమ్మ మాత్రమే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: