మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం 'ఆచార్య'.   మ్యాట్నీ మూవీస్ మరియు కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో అందాల భామ కాజల్ అగర్వాల్ చిరూ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కి ప్రేక్షకులల్లో భారీ స్పందన లభించింది.హిందూ దేవాలయాల చుట్టూ సాగే కోణంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు కొరటాల శివ. ఇప్పటికే 40 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇటీవల లాక్ డౌన్ వల్ల ఆగిపోయింది.మళ్ళీ కేంద్ర అనుమతులతో ఈ సినిమా షూటింగ్ ని రీసెంట్ గా మొదలు పెట్టింది మూవీ యూనిట్. ఇక ఇదిలా ఉంటే చిరంజీవితోపాటుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాలో నటించబోతూ ఉండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

దానికి తోడు ఈ సినిమాలో మన మెగాస్టార్ ఓ మాజీ నక్సలైట్ గా కూడా కనిపించనున్నారట. ఇదిలా ఉంటె కరోనా తో బ్రేక్ పడ్డ ఈ మూవీ షూటింగ్ ఇటీవలే మొదలై కొంత మేర షూటింగ్ జరుపుకుని కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఇక ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్ లో హల్చల్ చేస్తోంది. అదేంటంటే..'ఈ సినిమా కోసం ఇటీవల కేరళలోని ఒక గ్రామం సెట్‌ను హైదరాబాద్‌లో వేశారు. దానికి సుమారు రూ.20 కోట్లు ఖర్చు కూడా అయింది. ఈ సెట్‌ దాదాపు 16 ఎకరాల విస్తీర్ణంతో వేశారు'. మొదటిగా గుడి సెట్‌ కోసం నాలుగు కోట్లు ఖర్చు అయింది.

అక్కడ కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను కూడా షూట్‌ చేశారు. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ సినిమా షూటింగ్‌ మొదలు కానుంది.  వీలైనంత త్వరగా షూటింగ్ ను పూర్తి చేసే దిశగా ప్లాన్ చేస్తున్నారు దర్శకనిర్మాతలు..ఇక అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేసే అవకాశం ఉంది. ఈ సినిమా తర్వాత మెగాస్టార్ మరో రెండు ప్రాజెక్టులను లైన్లో పెట్టాడు. అందులో ఒకటి లూసిఫార్ రీమేక్ కాగా.. మరొకటి అజిత్ తమిళ సినిమా వేదళం రీమేక్. ఇందులో మొదటగా మలయాళ మూవీ లూసిఫార్ రీమేక్ పట్టాలెక్కనున్నట్టు సమాచారం...!!

మరింత సమాచారం తెలుసుకోండి: