అది 1998 సంవత్సరం రాంగోపాల్ వర్మ హీరోగా మెగాస్టార్ చిరంజీవి తో సినిమా చేస్తున్నారు అంటే అభిమానుల్లో ఆశలు బాగా ఉంటాయి కానీ ఏమైందో తెలియదట ఆ సినిమా అర్దాంతరంగా ఆగిపోయింది .. అయితే ఆ సినిమాకి సంబందించిన వీడియో సాంగ్ ఒకటి బయటికి వచ్చింది .. ఈ పాటలో చిరంజీవి చేత రామ్ గోపాల్ వర్మ బ్రేక్ సాంగ్ చేయించడం విశేషం .. ఈ పాట పై భిన్నమైన స్పందన వస్తుంది .. ఎక్కువగా చిరంజీవి పై  ఈ పాట ఎందుకు చేయించారని , చిరంజీవి కి ఈ పాట  సెట్ కాలేదని  వర్మ పై నెటిజన్లు తిట్ల వర్షం కురిపిస్తున్నారు ..

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ చిరంజీవితో ఒక చిత్రం చేశారనే విషయం మీలో ఎంతమందికి తెలుసు.. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చిరంజీవితో ఒక సినిమాని చేశారు.. కానీ  అది విడుదల కాలేదు .. ఆ సినిమా  ఇప్పటిది కాదు 1998  సంవత్సరంలో జరిగింది  ..చిరంజీవి హీరోగా టబు  హీరోయిన్ గా  రామ్ గోపాల్ వర్మ వినాలని ఉంది అనే చిత్రం ప్రారంభించారు.. 90 కాలంలో వరుస సినిమాలతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు  రాంగోపాల్ వర్మ ఒక వెలుగు వెలిగారు .. అయితే ఆ సమయం లో చిరంజీవి తో వర్మ ఒక సినిమాని చేద్దామని ఒప్పుకున్నారు .అయితే వర్మ చిరంజీవి ముందుకు ఈ వినాలని వుంది స్క్రిప్ట్ తో ముందుకు వెళ్లారు .. అయితే చిరంజీవి కి కథ నచ్చడం తో వెంటనే షూటింగ్ ని మొదలు పెట్టారు ..  

కొన్ని రోజులు చిత్రీకరణ జరుపుకున్న ఆ సినిమా ఆ తర్వాత  అర్ధాంతరంగా ఆగిపోయింది..  దీనికి గల కారణం కథ విషయంలో  డైరెక్టర్ కి మరియు హీరోకి విభేదాలు రావడం.. దాంతో ఈ సినిమా ముందుకు పోలేదు అయితే ఈ చిత్రం కోసం మణిశర్మ  రెండు పాటలని చేసారు . అయితే సినిమా ఆగిపోవడంతో ఆ పాటల్ని చూడాలని ఉంది  సినిమాలో వాడారు..   గుణశేఖర్ దర్శకత్వంలో చిరంజీవి చూడాలని ఉంది అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే ..
అయితే సినిమా చిత్రీకరణలో భాగంగా హీరో హీరోయిన్ పై  రెండు పాటల్ని షూట్ చేశారట .అందులోని ఒక  పాట యూట్యూబ్ లో తెగ వైరల్ అవుతుంది..  ఈ పాటలో  చిరంజీవి మరియు ఊర్మిళ  డాన్స్ తో అదరగొట్టడం విశేషం ..






 



మరింత సమాచారం తెలుసుకోండి: