ఒక్కడు చిత్రం తో మహేష్ బాబు హీరో నుండి స్టార్ గా ఎదిగారు. ఆ సినిమాలో మహేష్ బాబు ని చూసి ఫిదా అవ్వని లేడీస్ లేరంటే నమ్మండి. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఒక్కడు సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచి, ఎన్నో ఏళ్ళు గడిచిన అభిమానుల మనసుల్లో ఇంకా గుర్తుంది. ఈ సినిమాలో వేసిన చార్మినార్ సెట్ ఒక అద్భుతం. అలాగే సినిమాలోని పాటలు, ఫైట్స్  మరియు డైలాగ్స్ గురించి ఎంత చెప్పిన తక్కివే. ఈ సినిమా వల్ల విలన్ గా ప్రకాష్ రాజ్ కి సైతం మంచి పేరు వచ్చిది.

మహేష్ బాబు చెల్లి ఎక్కడ

ఒక్కడు సినిమాలో మహేష్ బాబు చెల్లి గా నటించిన నిహారిక అందరికి గుర్తు ఉండే ఉంటుంది. ఈ సినిమా కన్నా ముందే నిహారిక అనేక తెలుగు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. ప్రేమించుకుందాం రా సినిమాలో వెంకటేష్ కి కోడలుగా మావయ్య మీ వూళ్ళో అమ్మాయిలు లేరా అంటూ నిహారిక చెప్పిన డైలాగ్స్ తో ఆమెకు మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక యమజాతకుడు,  సీతారాముల కల్యాణం సినిమాల్లో సైతం ఆమె తన నటనతో ఆకట్టుకుంది.
 
నిహారిక నటించిన ఒక్కడు సినిమానే ఆమెకు తెలుగులో ఆఖరు సినిమా. ఆ తర్వాత ఆమె మారె సినిమాలోనూ కనిపించలేదు. అభిమానులు కూడా ఆల్మోస్ట్ ఆమెను మర్చిపోయారు. ఇక ఆమె ఎలా ఉంది ఇపుడు ఏం చేస్తుంది అనే విషయాలు ఎవ్వరికి తెలియవు. అలాగే ఆమె లేటెస్ట్ ఫొటోస్ ఎక్కడ కూడా నెట్ లో కనిపించలేదు. అప్పట్లో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది అనే వార్త మీడియాలో కనబడ్డ అది నిజం కాలేదు.

 ఇక కొన్ని రోజుల నుండి యూట్యూబ్ ఛానెల్స్ లో ఇదిగో ఈమె నిహారిక అంటూ కొన్ని ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. కానీ నిజానికి అవన్నీ కూడా ఫేక్ వార్తలే. అస్సలు నిహారికకు సంబందించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ ప్రస్తుతం ఎవరి దగ్గర లేదు. ఆమె పూర్తిగా మీడియా నుండి, సోషల్ మీడియా నుండి దూరంగా ఉంది. ఆమె ఇంకా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చే అవకాశమే లేదు. ఎందుకుకంటే ఆమె ఒక్కడు సినిమాలో నటించి ఇప్పటికే 17 ఏళ్ళు గడుస్తుంది. ఈ సినిమా సమయానికి ఆమె టీనేజ్ లో ఉంది. ఇప్పుడు ఆమె వారు దాదాపు గా 30 కి దగ్గరగా ఉంటుంది. ఇక ఆమె పెళ్లి చేసుకొని పిల్లలను సైతం కానీ హ్యాపీ గా ఫ్యామిలి లైఫ్ లీడ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి మీరు ఆమె గురించి చూసేవి అన్ని ఫేక్ వార్తలే.

మరింత సమాచారం తెలుసుకోండి: