హీరో రామ్  ఇస్మార్ట్ శంకర్ తో మంచి హిట్ కొట్టినా ఎందుకో డల్ గా కనిపిస్తున్నాడు. లాక్ డౌన్ దగ్గరినుంచి ఆయననుంచి ఎలాంటి అప్ డేట్ రావడం లేదు.. తన రాబోయే సినిమా రెడ్ గురించి ఎలాంటి ప్రమోషన్ కూడా చెయ్యట్లేదు.. నిజానికి ఇస్మార్ట్ శంకర్ సినిమాకి ముందు వరుస ఫ్లాప్ లతో కొట్టుమిట్టాడుతున్న రామ్ కి కరెక్ట్ టైం లో ఆ సినిమా హిట్ ఇచ్చిందని చెప్పాలి.. ఇస్మార్ట్ శంకర్ ఇచ్చిన హిట్ ఉత్సాహంతో రామ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో రెడ్ అనే సినిమా చేశాడు. వీరి కాంబో లో వస్తున్న మూడో సినిమా కావడంతో ఈ సినిమా ఫై మంచి అంచనాలున్నాయి..

మొదటిసారి డ్యూయల్ రోల్ చేయడంతో పాటు క్లాస్ మాస్ కు నచ్చే అన్ని అంశాలు ఉన్న సినిమా కావడంతో ఇస్మార్ట్ శంకర్ ట్రాక్ రికార్డుని కొనసాగిస్తుందనే గట్టి నమ్మకంతో ఉన్నాడు. తమిళంలో భారీ హిట్టు కొట్టిన తడం రీమేక్ గా రూపొందిన రెడ్ మీద అభిమానులు కూడా చాలా అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తయిన థియేటర్లు ఓపెన్ కాకపోవడంతో సినిమా ని హోల్డ్ లో పెట్టారు.. అయితే థియేటర్లు ఓపెన్ అన్ని సినిమాలు రిలీజ్ కి ఏర్పాట్లు చేసుకుంటున్న నేపథ్యంలో రామ్ మాత్రం రెడ్ పై ఇంకా ఏ నిర్ణయం తీసుకోవట్లేదు..

అయితే ఇప్పుడు రామ్ రెడ్ సినిమా ని రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారని వార్తలు వచ్చినా అవి పుకార్లే అని తెలుస్తుంది. దీంతో అసలు 'రెడ్' పండుగ సీజన్ లో వస్తుందా రాదా అని డౌట్ పడుతున్నారు. ఇదిలా ఉంటే 'రెడ్' విషయంలో ఆశించిన స్థాయిలో బిజినెస్ జరగలేదని.. అందుకే మేకర్స్ సైలెంటుగా ఉంటున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఫెస్టివల్ సీజన్ లో రిలీజ్ ఉంటే మాత్రం ఇప్పటి నుంచే ఏదొక అప్డేట్ తో ప్రమోషన్స్ చేయకపోతే 'రెడ్' మీద జనాలకి ఆసక్తి తగ్గిపోయే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. ఇప్పటికైనా రామ్ మేల్కొని సినిమా పై దృష్టి పెడితే మంచిది అంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: