కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కియారా అద్వానీ మంచి మంచి ప్రాజెక్ట్స్ తో ముందుకు సాగుతోంది. ఎన్నో పాపులర్ మూవీస్ లో కనిపించి సందడి చేస్తోంది. ఈ విషయాన్ని విస్మరించే పనేం లేదు. కబీర్ సింగ్ నటి తన పనిలో ప్రత్యేకమైన మార్క్ ను ఎప్పటికప్పుడు చూపిస్తూ వస్తోంది. ఫ్యాషన్ సెన్స్ తో యువతను ఉర్రూతలూగిస్తోంది. రెడ్ కార్పెట్స్ అప్పియరెన్స్ నుంచి వెడ్డింగ్స్ అలాగే ఇండస్ట్రీలోని పార్టీస్ వరకు స్టన్నింగ్ లుక్స్ తో కియారా అందరినీ మెస్మరైజ్ చేస్తోంది. అందమైన అవుట్ ఫిట్ ను క్యారీ చేయడం ఎలాగో కియారాకు బాగా తెలుసు అదే సమయంలో తనదైన స్టయిల్ ను కూడా బాగానే మెయింటెయిన్ చేస్తుంది.  మరి కియారా క్లోజెట్ లో ఉండే ఆ ఐదు ఏమిటి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 



1. శారీస్: కియారా క్లోజెట్ లో శారీస్ కు ప్రముఖ స్థానం ఉంది. శారీస్ అనేవి ఏ అకేషన్ కైనా పెర్ఫెక్ట్ గా సూట్ అవుతాయి. వెడ్డింగ్ నుంచి ఫ్యామిలీ గ్యాదరింగ్ వరకు దేనికైనా శ్యారీస్ పెర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి. 


2. కుర్తా సెట్: కియారా క్లోజెట్ లో కుర్తా సెట్ కు కూడా స్థానం ఉంది. అకేషన్ కి తగ్గట్టుగా కుర్తా సెట్ ను పిక్ చేసుకుంటుంది. 

3. డెనిమ్ జాకెట్: ఏదీ వర్కవుట్ కాకపోతే, క్యాజువల్ లుక్ ను మెయింటెయిన్ చేయడానికి డెనిమ్ జాకెట్ ను ప్రిఫర్ చేస్తుంది. స్టైల్ ను క్లాసిక్ వేలో క్యారీ చేసేందుకు డెనిమ్ ను పెర్ఫెక్ట్ అవుట్ ఫిట్స్ తో మ్యాచ్ చేస్తుంది కియారా. 

4. బ్లాక్ డ్రెస్ : బ్లాక్ కలర్ క్రియేట్ చేసే మ్యాజిక్ అంతా ఇంతా కాదు. మీరు గనక గమనిస్తే సెలెబ్రిటీలు చాలా మంది బ్లాక్ డ్రెస్ లో తళుక్కుమనడానికి ఇష్టపడతారు. కియారా కూడా బ్లాక్ డ్రెస్ ను తన క్లోజెట్ లో ఉంచుకుంటుంది. 

5. ట్యాంక్ టాప్, జాగర్ ప్యాంట్స్: అలాగే, ట్యాంక్ టాప్ తో పాటు జాగర్ ప్యాంట్స్ కు కూడా తగినంత ప్రయారిటీ ఇస్తుంది కియారా. ఇప్పుడర్థమైందా కియారా ఫ్యాషనిష్టాలను ఎలా ఎట్రాక్ట్ చేస్తుందో. 

మరింత సమాచారం తెలుసుకోండి: