లాక్ డౌన్ లో ఇండస్ట్రీని ఆశ్చర్యంలో ముంచెత్తిన విషయం ప్రముఖ నిర్మాత దిల్ రాజు వివాహ వేడుక. సన్నిహితుల సమక్షంలో దిల్ రాజు రెండో వివాహం చేసుకున్నారు. ఈ వివాహ వేడుకలు టాక్ ఆఫ్ ది టవున్ గా మారాయి. కొంతమంది ఈ వయసులో దిల్ రాజుకి పెళ్లేంటి అని ఆశ్చర్యపోగా మరికొందరు వయసేదైనా తోడు మాత్రం అవసరం అని తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. ఏది ఏమైనా, ఈ న్యూస్ మాత్రం అప్పట్లో బాగా వైరలైంది.



దిల్ రాజు భార్య గురించి తెలుసుకోవడానికి నెటిజెన్స్ విపరీతమైన ఆసక్తి కనబరిచారు. దిల్ రాజు కూడా తన భార్యతో కలిసి సందర్శించిన టెంపుల్ ఫోటోస్ ను అభిమానులతో సోషల్ మీడియా ద్వారా ఎప్పటి కప్పుడు షేర్ చేసారు. షేర్ చేస్తున్నారు కూడా.  అలాగే, ప్రతి ఈవెంట్ లో తన వైఫ్ తో కలిసి కనిపిస్తున్నారు. 



దిల్ రాజు భార్య తేజశ్విని కూడా దిల్ రాజుకు అన్ని విధాలా సహకారం అందిస్తున్నట్టు తెలుస్తోంది. సినిమాలకు సంబంధించిన అంశాలలో ఈవిడ చూపిస్తున్న చొరవ అలాగే అందిస్తున్న సలహాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని దిల్ రాజు సన్నిహితులతో అంటున్నారట. రీసెంట్ గా ఈవిడ ఓ స్టోరీ లైన్ చెప్పారట. ఆ స్టోరీ లైన్ బాగా నచ్చడంతో వెబ్ మూవీను తెరకెక్కించాలని దిల్ రాజు ఫిక్సయ్యాడట. మొత్తానికి తేజస్విని గారు రైటర్ గా తెరకు పరిచయమవడం దాదాపు ఖాయమైపోయింది ఫిలిం నగర్లో టాక్. 

మరింత సమాచారం తెలుసుకోండి: