ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... నాచురల్ స్టార్ నాని ఈ ఏడాది ‘V’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఓటీటీ ద్వారా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.ఎన్నో భారీ అంచనాలతో పైగా నాని కెరీర్లో 25వ సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రం ఘోరమైన ప్లాప్ ని మూటగట్టుకుంది. మహేష్ బావ సుధీర్ బాబు మరో హీరోగా నటించాడు. యాక్టింగ్ పరంగా ఇద్దరు హీరోలు ఆకట్టుకున్న కాని ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయింది. ఈ చిత్రానికి ఇంద్రగంటి మోహన్‌క్రిష్ణ దర్శకత్వం వహించారు. అదితీరావు హైదరి, నివేదా థామస్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంతో ఓటీటీ ద్వారా ప్రేక్షకులను పలకరించిన నాని..చాలా దెబ్బ తిన్నాడు. అందుకే ఇప్పుడు  ‘టక్ జగదీష్’తో మాత్రం నేరుగా థియేటర్లలోకే రానున్నారు.

సంక్రాంతికి ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది. నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ఈ సినిమా శివ నిర్వాణ ద‌ర్శక‌త్వంలో రూపొందుతోన్న ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ గా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా షూటింగ్ శుక్రవారం హైద‌రాబాద్‌లో చివ‌రి షెడ్యూల్లోకి ప్రవేశించింది. నాని 26వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ మూవీని షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శుక్రవారం హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైన చివరి షెడ్యూల్‌లో చిత్రంలోని ప్రధాన తారాగ‌ణ‌మంతా పాల్గొంటున్నారు.


ఈ సినిమాలో రీతు వ‌ర్మ, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. జగపతి బాబు, రావు రమేష్, నరేష్, నాజర్, దేవదర్శిని, రోహిణి, మాల పార్వతి, డేనియల్ బాలాజి, తిరువీర్, ప్రవీణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఎస్‌. త‌మ‌న్ సంగీతం స‌మ‌కూరుస్తున్న ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ప్రవీణ్ పూడి ఎడిటర్. వెంకట్ ఫైట్స్ కంపోజ్ చేస్తు్న్నారు. లక్ష్మణ్ ముసులూరి కో-డైరెక్టర్. ఎస్. వెంకటరత్నం (వెంకట్) ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో మూవీ విశేషాలు గురించి తెలుసుకోండి..

మరింత సమాచారం తెలుసుకోండి: