బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ కు అంతా సిద్ధం చేస్తున్నారు. సీజన్ 4 ఈమధ్యనే మొదలైందని అనిపిస్తున్నా ఇప్పటికే 13 వారాలు ముగించుకుంది. మరో మూడు వారాల్లో ఈ సీజన్ ముగుస్తుంది. ముగింపు దశకు చేరుకుంటున్న ఈ టైం లో ఎవరు గెలుస్తారు అన్న ఆసక్తి ఇంకా పెరిగింది. డిసెంబర్ 20 మెగా ఈవెంట్ గా బిగ్ బాస్ సీజన్ 4 ఫైనల్ ఎపిసోడ్ జరుగనుందని తెలుస్తుంది. ఈ సీజన్ ఫైనల్ ఎపిసోడ్ కు గెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ గెస్ట్ గా వస్తారని టాక్.

బిగ్ బాస్ సీజన్ 3కి నాగార్జున హోస్ట్ గా చేశారు. ఆ సీజన్ కు ఫైనల్ ఎపిసోడ్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి వచ్చారు. అయితే ఈసారి సూపర్ స్టార్ మహేష్ గెస్ట్ గా వస్తాడని తెలుస్తుంది. మహేష్ బిగ్ బాస్ టీం అడగడమే కాకుండా నాగార్జున స్పెషల్ గా ఇన్వైట్ చేస్తుండటంతో బుల్లితెర షోకి మహేష్ గెస్ట్ గా రానున్నాడని తెలుస్తుంది.

ఇక ఈ సీజన్ విజేత ఎవరైనా సరే మహేష్ తో టైటిల్ కప్ తీసుకుంటారని తెలుస్తుంది. సీజన్ 4లో విన్నర్ అయ్యే ఛాన్స్ ఒకరి పేరు బాగా వినిపిస్తున్నా ఫైనల్ ఎపిసోడ్ వరకు వచ్చే ఓటింగ్స్ ను బట్టి విజేతని నిర్ణయిస్తారని తెలుస్తుంది. నాగార్జున, మహేష్  ఇద్దరు కలిసి బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ ను ఎనౌన్స్ చేస్తారట. మహేష్ రావడం అంటూ జరిగితే ఫైనల్ ఎపిసోడ్ మాత్రం అదరగొట్టేస్తుందని చెప్పొచ్చు.  



మరింత సమాచారం తెలుసుకోండి: