నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాకు ఇంకా టైటిల్ ఎనౌన్స్ చేయలేదు. సినిమాకు సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత బాలకృష్ణ బి.గోపాల్ తో సినిమా చేస్తాడని అంటున్నారు. గోపాల్ డైరక్షన్ లో బాలయ్య బాబు సూపర్ హిట్స్ కొట్టాడు. మరోసారి ఈ కాంబో రిపీట్ అవుతుందని తెలుస్తుంది.

ఇక ఈ సినిమాతో పాటుగా బాలకృష్ణ కందిరీగ డైరక్టర్ బలరామయ్య బరిలోకి దిగితే సినిమా చేస్తాడని అంటున్నారు. ఇప్పటికే సంతోష్ శ్రీనివాస్ బాలకృష్ణకు కథ చెప్పడం బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందట. సినిమాకు టైటిల్ కూడా బలరామయ్య బరిలోకి దిగితే అని పెట్టడంతో ఆ టైటిల్ కు కూడా బాలయ్య కన్ విన్స్ అయినట్టు చెబుతున్నారు.

ప్రస్తుతం సంతోష్ శ్రీనివాస్ బెల్లంకొండ శ్రీనివాస్ డైరక్షన్ హీరోగా అల్లుడు అదుర్స్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ సినిమా చేస్తాడని తెలుస్తుంది. బలరామయ్య బరిలోకి దిగితే బాలకృష్ణకు పర్ఫెక్ట్ టైటిల్. నందమూరి ఫ్యాన్స్ సూపర్ అనేస్తున్న ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ ఎప్పుడు వస్తుందో చూడాలి. ఈ సినిమాతో పాటుగా మరోసారి పూరీ డైరక్షన్ లో బాలకృష్ణ సినిమా ఉంటుందని అంటున్నారు. ఆ సినిమాకు సంబందించిన న్యూస్ కూడా బయటకు రావాల్సి ఉంది. యువ హీరోలకు ధీటుగా బాలకృష్ణ వరుస సినిమాలు చేస్తున్నారు. బోయపాటి సినిమా పూర్తి కావడమే ఆలస్యం వెంటనే మరో సినిమా చేస్తాడని తెలుస్తుంది.                                                           



మరింత సమాచారం తెలుసుకోండి: