బిగ్ బాస్ సీజన్ 4లో వన్ ఆఫ్ దిస్ ట్రాంగ్ కంటెస్టంట్ గా వచ్చాడు అభిజిత్. హౌజ్ లో అందరు సూపర్ ఎమోషనల్ అవుతున్నా ఇప్పటివరకు తను పెద్దగా ఎమోషనల్ అయ్యింది మాత్రం లేదు. హౌజ్ లో కోపం, ఆవేశం, బలం, బలహీనత అన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ హౌజ్ లో తన సత్తా చాటుతున్నాడు. అయితే హౌజ్ లో పరిస్థితులు ఎలా ఉన్నా అభిజిత్ తన ఆట తీరుతో ఆకట్టుకుంటున్నాడు.

బిగ్ బాస్ హౌజ్ లో అభిజిత్ ఆట తీరుకి బయట ఆడియెన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈ సీజన్ బిగ్ బాస్ విజేతగా అభిజిత్ కు గెలిచే ఛాన్సులు ఉన్నాయని తెలుస్తుంది. అభిజిత్ సినీ కెరియర్ కు తప్పకుండా బిగ్ బాస్ బూస్టింగ్ ఇచ్చేలా ఉంటుందని తెలుస్తుంది. తప్పకుండా బిగ్ బాస్ అభిజిత్ కెరియర్ ను మళ్లీ తిరిగి గాడిలో పడేలా ఉంటుందని చెప్పొచ్చు.

అభిజిత్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో హీరోగా చేశాడు. శేఖర్ కమ్ముల డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా మంచి ఫలితాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా తర్వాత అభిజిత్ పెద్దగా ఆఫర్లు అందుకోలేదు. పెళ్లిగోల వెబ్ సీరీస్ తో ఆకట్టుకున్న అభిజిత్ బిగ్ బాస్ వల్ల తన పాపులారిటీ పెంచుకున్నాడని చెప్పొచ్చు.

అయితే బిగ్ బాస్ లో అభిజిత్ ఆట తీరుని చూసి ఇక మీదట వరుస ఛాన్సులు వచ్చేలా ఉన్నాయని తెలుస్తుంది. మరి అభిజిత్ హీరోగా తిరిగి ఫాం లోకి వస్తాడా లేదా అన్నది చూడాలి. తప్పకుండా అభిజిత్ కు హీరోగా కెరియర్ లో సత్తా చాటుతాడని తెలుస్తుంది.                                               

మరింత సమాచారం తెలుసుకోండి: