ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా చాలా మందిని పొట్టనబెట్టుకుంది. చాలా మంది ఆర్ధికంగా చాలా ఇబ్బదులు పడ్డారు. ఆ ఇబ్బందులు తట్టుకోలేక చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. కరోనా వైరస్ ప్రభావం వల్ల ముఖ్యంగా సినిమా పరిశ్రమ చాలా దెబ్బ తిన్నది. సినిమా పరిశ్రమకి సంబంధించిన చాలా మంది ఆర్ధిక సమస్యలతో రోడ్డున పడ్డారు. ఆర్ధిక ఇబ్బందులు తట్టుకోలేక ఇలా ఏం చెయ్యలేక ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇక అసలు విషయానికి వస్తే బాలీవుడ్  టెలివిజన్  రంగంలో విషాదం చోటుచేసుకుంది. పలు హిందీ టీవీ సీరియల్స్‌కు రైటర్‌గా పనిచేసిన అభిషేక్‌ మక్వానా ఆత్మహత్మ చేసుకున్నారు. ముంబయిలోని తన ఇంట్లోనే ఆయన ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఆర్థిక సమస్యలతోనే తాను బలవన్మరణానికి పాల్పడుతున్న సూసైడ్ నోట్‌లో రాశారు.

కోవిడ్ 19 కారణంగా సినిమా ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్డ్    చాలా కుదేలు కావడంతో తాను ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నానని, కనీస అవసరాలు తీర్చుకోవడానికి తన వద్ద డబ్బుల్లేవని అభిషేక్ లేఖలో పేర్కొన్నారు. దీనికి తోడు తీసుకున్న అప్పులు తీర్చే మార్గం కనిపించక దిక్కుతోచని పరిస్థితుల్లోనే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు ఆయన లేఖలో రాశారు.ఇంకా ఇలాంటి మరెన్నో ఆసక్తి కరమైన  అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: