ఇండియా  హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి. మెగా ఫ్యామిలీ ఇంట  పెళ్లి సందడి మొదలైంది. మెగా వారసురాలు  నిహారిక  వివాహానికి వారం ముందుగానే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలుపెట్టిన మెగా ఫ్యామిలీ ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. మెగా ఫ్యామిలీ  హీరోలతో పాటు, మెగా వారసులంతా నాగబాబు ఇంటికి చేరి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో పాల్గొంటున్నారు. ఇక ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులతో ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ చాలా  యాక్టివ్‌గా ఉంది కొత్త పెళ్లి కూతురు నిహారిక. ఈ క్రమంలో  తాజాగా తనను పెళ్లి కూతురుగా ముస్తాబు చేసిన ఫొటో, ప్రస్తుతం ఇంట్లో ఉన్న సందడి వాతావరణాన్ని పోస్ట్ చేసింది మెగా వారసురాలు నిహారిక...

ఇక పెళ్లి కొడుకు విషయానికి వస్తే గుంటూరు ఐజి రేంజ్ ప్రభాకర్ రావు కొడుకు తో ఈమె వివాహం నిశ్చయమైంది. చైతన్య టెక్ మహీంద్రా కంపెనీలో టెక్కీ గా పని చేస్తాడు.డిసెంబ‌ర్ 9వ తేదీన రాజ‌స్తాన్‌లోని ఉద‌య్‌పూర్ ప్యాలెస్‌లో నిహారిక పెళ్లి వేడుక జరగనుంది. ఇప్పటికే అక్కడ పెళ్లి ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. అంగ‌రంగ వైభవంగా జ‌ర‌గ‌నున్న ఈ పెళ్లి వేడుక‌కు మెగా ఫ్యామిలీ అంతా హాజరు కానున్నారు. కాగా ఈరోజు నిహారికను పెళ్లి కూతురుగా ముస్తాబు చేశారు.డిసెంబర్ 9న జరగనున్న నిహారిక డెస్టినేషన్ వెడ్డింగ్‌లో చిరంజీవి, పవన్ కళ్యాణ్ సహా కొందరు సినీ ప్రముఖులు  సందడి చెయ్యబోతున్నారు. ఆ తర్వాత సినీ, రాజకీయ ప్రముఖులందరి కోసం హైదరాబాద్‌లో స్పెషల్ పార్టీ ఏర్పాటు చేయబోతుంది  మెగా ఫ్యామిలీ.ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి....

మరింత సమాచారం తెలుసుకోండి: