ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోల్లో యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో విజయ్ దేవరకొండ.. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా తో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుని పెళ్లి చూపులు సినిమా తో హీరో గా పరిచయమై టాలీవుడ్ దృష్టి ని ఆకర్షించాడు.. ఆ తరువాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా తో స్టార్ హీరో గా ఎదిగాడు.. ఈ సినిమా ఎలాంటి ట్రెండ్ సృష్టించిందో అందరికి తెలిసిందే..  హీరో విజయ్ ని స్టార్ హీరో గా నిలబెట్టిన సినిమా.. ఓవర్ నైట్ లో చిన్న సినిమాలు చేసే విజయ్ ని స్టార్ హీరో చేసిన సినిమా అర్జున్ రెడ్డి.. ఈ సినిమా వల్ల ఎక్కువ లాభపడింది నిర్మాత అనేకంటే విజయ్ దేవరకొండ అని చెప్పాలి.. ఈ సినిమా తర్వాత విజయ్ వరుస సినిమాలు చేస్తూ వరుస హిట్ లతో టైర్ 2 హీరోల్లో టాప్ ప్లేస్ ని అయితే సంపాదించుకున్నాడు..

అర్జున్ రెడ్డి సినిమా తరువాత విజయ్ గీత గోవిందం సినిమా తప్పా ఆయనకు ఆ రేంజ్ లో ఏ సినిమా హిట్ రాలేదని చెప్పాలి.. అయన గత సినిమా వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా భారీ ఫ్లాప్ ని ఎదుర్కొంది. దాంతో స్టార్ దర్శకులతో తప్పా సినిమాలు చేయనని చెప్పేశాడు విజయ్.. ఆ క్రమంలోనే పూరి జగన్నాధ్ తో ఫైటర్ అనే సినిమా చేస్తున్నాడు విజయ్.. ఇస్మార్ట్ శంకర్ వంటి భారీ హిట్ తర్వాత పూరి జగన్నాథ్ వరుస విజయాలతో స్టార్ డం సాధించిన విజయ్ దేవరకొండ సినిమా చేస్తుండడంతో ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ కథకు పాన్ ఇండియా అప్పీల్  వుండడంతో పూరీ దీనిని  ఛార్మితో కలసి  పాన్ ఇండియా స్థాయిలోనే నిర్మిస్తున్నాడు.  

సీనియర్ హీరోలు సైతం కరోనా భయం లేకుండా షూటింగ్ లో జాయిన్ అయితే విజయ్ దేవరకొండ ఎందుకు ఆలస్యం చేస్తున్నాడనే ప్రశ్న అందరిలో వ్యక్తం అవుతుంది. డిసెంబర్ మొదటి వారంలో షూటింగ్ ప్రారంభం అవ్వబోతుంది అనుకుంటే ఈ నెలలో కూడా షూటింగ్ లేదని తేలిపోయింది. జనవరి రెండవ వారంలో ఫైటర్ ను పునః ప్రారంభించే అవకాశం ఉందంటున్నారు. ఫైటర్ సినిమా కోసం విదేశీ ఫైటర్స్ కావాల్సి ఉంది. కరోనా పరిస్థితుల కారణంగా వారు వచ్చేందుకు ఇబ్బందులు ఉన్నాయి. అందుకే ఈ సినిమా నిర్మాణం పునః ప్రారంభం ఆలస్యం అవుతుంది అంటూ యూనిట్ సభ్యులు అనధికారికంగా చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: