‌ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి."ఆర్ ఎక్స్ 100" సినిమాలో చాలా బోల్డ్ అండ్ హాట్ గా నటించి యూత్ మనసులని కొల్లగొట్టింది పాయల్ రాజ్ పుత్. హాట్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకొని అత్యంత తక్కువ సమయంలో ఫేమస్ హీరోయిన్ అయింది. అంతేకాదు, నటించింది కొన్ని సినిమాల్లోనే అయినా తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకుంది. ఈరోజు అనగా డిసెంబర్ 5న  తన పుట్టినరోజున తన లవర్‌ని పరిచయం చేసి పెద్ద సర్ ప్రైజ్ ఇచ్చింది పాయల్. సోషల్ మీడియా లో తన హాట్ హాట్ పిక్స్ తో సందడి చేస్తూ ఉంటుంది. గత కొంతకాలంగా ఫొటోషూట్స్‌తో రచ్చ చేస్తున్న ఈ అమ్మడు తాజాగా తన ప్రియుడి ఫొటోను పోస్ట్ చేసింది.

కొన్ని రోజులుగా పాయల్ ప్రేమ వ్యవహారంపై జనాల్లో చర్చలు నడుస్తుండగా ఈ పిక్ రిలీజ్ చేసి తాను ప్రేమలో ఉన్నట్లు కన్ఫర్మ్ చేసింది ఈ హాట్ బ్యూటీ.... ''హ్యాపీ బర్త్ డే మై లవ్'' అంటూ తన ప్రియుడు సౌరబ్ దింగ్రా సోషల్ మీడియా లో  పోస్ట్ చేసింది. లవ్ ఎమోజీలను జత చేసింది. ఈ మేరకు సౌరబ్ దింగ్రాతో కలిసి తాను దిగిన ఓ పిక్ షేర్ చేసింది. దీంతో ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసి పాయల్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూనే ఆల్ ది బెస్ట్ అంటూ విష్ చేస్తున్నారు నెటిజన్లు.ఇంకా ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరిన్ని విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: