సోను సూద్  కరోనా  సమయంలో   ఎంతోమంది వలస కూలీలను తన సొంత ఖర్చులతో వారి వారి   స్వస్థలాలకు పంపిన  విషయం తెలిసిందే .. దాంతో ఎంతో మంది వలస కూలీల్లో సోనూసూద్  దేవు డైయ్యాడు..  అంతే కాదు ఎంతో మంది పేద విద్యార్థులు  చదువులో  సహాయం చేసి వారి  జీవితాల్లో వెలుగు నింపిన వ్యక్తి  సోను సూద్ ..

కరోనా  సోను సూద్  చేసిన పనులను యావత్ భారతదేశం అతన్ని అభినందిస్తుంది  .. అంతే కాదు పలు చిత్ర షూటింగ్ లో కరోనా సమయం లో చేసిన పనులకి  సోను సూద్ ని సత్కరించుకోవడం  విశేషం.. సోను సూద్ చేసిన మానవతా సేవలకు  పలు అవార్డులు కూడా  వరించాయి  .. ప్రపంచ ప్రఖ్యాత  ఐక్యరాజ్యసమితి  సోను సూద్  కి అవార్డు ప్రకటించిన  విషయం తెలిసిందే..

తాజాగా ఆంధ్రప్రదేశ్ కి చెందిన శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ సోను సూద్ కి  అరుదైన  గౌరవాన్ని కట్టబెట్టింది.. దేశంలోనే  చాలా మంది  ఐఏఎస్ మరియు ఐపీఎస్ లను అందించిన కాలేజి గా శరత్ చంద్ర అకాడమీకి మంచి పేరుంది ..  అయితే సోను సూద్ గౌరవార్థం  కాలేజీలోని ఆర్ట్స్ అండ్  హ్యుమానిటీస్ విభాగానికి అతని పేరు పెట్టడం  నిజంగా మంచి విషయం .. దీంతో ఆ విభాగానికి సోను సూద్ కాలేజ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్ట్స్ అండ్  సైన్  గా పేరు మార్చింది .. ఈ విషయాన్నీ ట్విట్టర్ వేదికగా  కాలేజీ విభాగానికి మార్పు చేసినట్లు  కాలేజీ వర్గాలు తెలిపాయి...

 అయితే ఈ విషయంపై  సోను సూద్  స్పందించారు.. ఎంతోమంది ఐఏఎస్ లను   అందించిన గొప్ప  కాలేజీలోని  ఒక విభాగానికి తన పేరు పెట్టడం చాలా సంతోషమని అన్నారు .. ఈ సందర్భంగా కాలేజ్ యాజమాన్యానికి సోనూసూద్  కృతజ్ఞతలు తెలిపారు...  సోను సూద్ ప్రస్తుతం తెలుగు మరియు తమిళ్ చిత్రాలు చేస్తూ  బిజీగా గడుపుతున్నారు ... ఒక నటుడి పేరుని కాలేజీ అకాడమీలో ఒక విభాగానికి పేరు  పెట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం ..  ఆ అదృష్టం సోను సూద్ గారికి దక్కడం నిజంగా గొప్ప విషయం ..    


మరింత సమాచారం తెలుసుకోండి: