రాజమౌళి డైరక్షన్ లో వస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా న్యూ ఇయర్ గిఫ్ట్ కు అందరు సిద్ధంగా ఉన్నారు. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఇద్దరు కలిసి చేస్తున్న ఈ సినిమా ఇద్దరి పాత్రల టీజర్ లతో సినిమాపై అంచనాలు పెంచారు. ప్రేక్షకులు ఎన్ని అంచనాలతో వచ్చినా ఆ అంచనాలను మించి ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు. సినిమాలో కొమరం భీం, అల్లూరి సీతారామరాజు టీజర్లకు సూపర్ రెస్పాన్స్ రాగా త్వరలో ఇద్దరు ఉన్న ట్రైలర్ వస్తుందని తెలుస్తుంది.

ఆర్.ఆర్.ఆర్ సినిమా ట్రైలర్ న్యూ ఇయర్ గిఫ్ట్ గా వస్తుందని తెలుస్తుంది. ఈ సినిమా ట్రైలర్ తో సినిమాపై మరింత క్రేజ్ వస్తుందని అంటున్నారు. ఒక హీరో ఉంటేనే అద్భుతాలు చేసే రాజమౌళి ఇద్దరు హీరోలు కలిసి చేసే ఈ సినిమాతో మరోసారి తెలుగు సినిమా స్థాయి ఏంటో  చూపిస్తాడని తెలుస్తుంది. ఆర్.ఆర్.ఆర్ ట్రైలర్ ఎలా ఉంటుంది.. కొమరం భీం.. సీతారామరాజు పాత్రలు ఎలా ఉండబోతాయి అన్న దాని మీద ఆడియెన్స్ లో ఎక్సయిటింగ్ మొదలైంది.

డివివి దానయ్య 400 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మిస్తున్నారు. సినిమాలో అజయ్ దేవగన్, అలియా భట్, ఒలివియా మోరిస్ లు నటిస్తున్నారని తెలిసిందే. ఈ సినిమాకు సంబందించిన ప్రతి అప్డేట్ ప్రేక్షకులను ఫుల్ ఖుషి చేస్తున్నాయి. ఆర్.ఆర్.ఆర్ సినిమా అదరగొట్టడం ఖాయమని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: