హీరోయిన్ అంటే... ఓ పది సీన్స్.. నాలుగు పాటలు... మొత్తం మీద ఓ నెల రోజులపాటు షూటింగ్‌లో పాల్గొంటే చాలు. ఇలాంటి వార్తలకు ముద్దుగుమ్మలు చెక్‌ పెడుతున్నారు. ఇలాంటి వాతావారణం నెమ్మిదిగా మారుతోంది. సినిమాకు హీరోనే కాదు.. హీరోయిన్ కూడా ఇంపార్టెంటేనని మన రచయితలు.. దర్శకులు నిరూపిస్తున్నారు. స్టార్స్ పక్కన నటిస్తున్న ముద్దుగుమ్మల పాత్రలు చూస్తే... మీరు కూడా నిజమే అంటారు.

పెర్‌ఫార్మెన్స్‌కు అవకాశాలు రావాలేగానీ... ముద్దుగుమ్మలు సైతం తామేమిటో చూపిస్తారు. లేడీ ఓరియెంట్ మూవీస్ ఎక్కువగా చేస్తున్న కీర్తిసురేష్... హీరో పక్కన బలమైన పాత్ర ఉంటేనే సైన్ చేస్తోంది. ఈక్రమంలో సర్కారువారి పాటలో మహేశ్‌తో జత కడుతోంది. బ్యాంక్ కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో... దర్శకుడు పరశురామ్ కీర్తికి ఇంపార్టెంట్ రోల్ ఇచ్చాడని.. బ్యాంక్ అధికారిగా నటిస్తోందని సమాచారం.

సాధారణంగా ఫస్ట్ లుక్‌లో హీరో ఒక్కడే కనబడతాడు. అయితే.. రాధే శ్యాంలో ఫస్ట్ లుక్ రొమాంటిక్‌గా డిజైన్ చేశారు. టైటిల్లోనే హీరోయిన్ పేరు రాధ వుండడంతో పూజా పాత్రకు ఎంత ఇంపార్టెన్స్ వుందో తెలుస్తోంది. 60వ దశకం లవ్‌స్టోరీగా రూపొందుతున్న ఈ పీరియాడికల్ మూవీలో పూజా టీచర్‌గా నటిస్తోందట.

పుష్ప సినిమాలో రష్మికది కూడా ప్రాధాన్యమున్న పాత్రే. గిరిజన యువతిగా ఫస్ట్ టైం డీగ్లామరైజ్డ్ రోల్ పోషిస్తోందని సమాచారం.  యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న క్యారెక్టర్ దొరికిందన్న ఆనందంలో రష్మిక ఉంది.  సినిమా ఈ అమ్మడి మాట తీరు చిత్తూరు స్లాంగ్‌లో ఉంటుందట. దీని కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకొని... చిత్తూరు యాసను ప్రాక్టీస్‌ చేసింది ఈ కన్నడ బ్యూటీ. మొత్తానికి రష్మిక, పూజా హెగ్డే నటిగా నిరూపించుకోలేదనే వార్తలు గుప్పుమంటున్నాయి.

రాధే శ్యామ్‌లో పూజాది ఇంపార్టెంట్‌ రోల్ అట. యాక్టింగ్‌కు స్కోప్‌ ఉన్న టీచర్‌ పాత్రలో పూజా నటిస్తోందట. లాక్‌డౌన్‌ సమయంలో చిత్తూరు స్లాంగ్‌ నేర్చుకున్న రష్మిక. చూద్దాం.. ఇకముందు వీళ్లు ఎలా పెర్ఫామెన్స్ చూపిస్తారో.







మరింత సమాచారం తెలుసుకోండి: