ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి. టాలెంటెడ్ యంగ్ హీరో సత్యదేవ్.. మొదట డబ్బింగ్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకొని తరువాత వివిధ సినిమాలలో సపోర్ట్ రోలింగ్స్ చేస్తూ ఆ తరువాత  వైవిధ్యమైన చిత్రాలతో హీరోగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంటున్నాడు. తాజాగా "తిమ్మరుసు" అనే మరో వైవిధ్యమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకి ‘అసైన్‌మెంట్‌ వాలి’ అనేది ఉప శీర్షిక. ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్, ఎస్‌ ఒరిజినల్స్‌ బ్యానర్లపై మహేశ్‌ కోనేరు, శ్రుజన్ ఎరబోలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్‌ శనివారం విడుదల చేసింది.ఈ ఫస్ట్ లుక్ విపరీతంగా ఆకట్టుకుంటుంది. డిసెంబర్‌ 9న టీజర్‌ను విడుదల చేయనున్నారు.



 ఈ సందర్భంగా చిత్రం నిర్మాతలు ఈ విధంగా స్పందించారు.. ‘తొలి నుంచి వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ హీరోగా, నటుడిగా సత్యదేవ్‌ తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్‌ చేసుకున్నారు. అలాంటి హీరోతో సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. ‘తిమ్మరుసు’ మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా. సత్యదేవ్‌ను సరికొత్త కోణంలో ఆవిష్కరించే చిత్రమిది. శనివారం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తున్నాం. డిసెంబర్‌ 9న టీజర్‌ను విడుదల చేస్తాం. షూటింగ్ దాదాపు పూర్తయింది. వచ్చే నెలలో సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం’ అని తెలిపారు.ఇంకా ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో అప్ డేట్స్ గురించి తెలుసుకోండి....

మరింత సమాచారం తెలుసుకోండి: