బిగ్ బాస్ సీజన్ 4లో 13వ వారం నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది చాలా ఆసక్తికరమైన చర్చలు జరిగాయి. నామినేషన్స్ లో ఐదుగురు ఉన్నా కూడా డేంజర్ జోన్ లో కేవలం ఇద్దరే ఇద్దరు ఉన్నారని అర్ధమైంది. 13వ వారం లో అందరి కన్నా లీస్ట్ ఓటింగ్స్ వచ్చిన వారిలో అవినాష్, మోనాల్ ఉన్నారు. ఇద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే అవినాష్ జబర్దస్త్ కమెడియన్ గా ఆల్రెడీ ఫేమస్ కమెడియన్. అయితే అతను నామినేషన్స్ లో ఉండటం వల్ల అతను కామెడీ చేయడం మానేసి ప్రతి దాని మీద పెడ అర్ధాలు తీయడం మొదలు పెట్టాడు.

ఇక మోనాల్ మూడు వారాల క్రితం వరకు అఖిల్ తోనే కనబడ్డది. అంతకుముందు ఆమె టాస్కుల్లో కూడా పెద్దగా పర్ఫాం చేసింది లేదు. ఈమధ్య ఆమె తన ఆటని ఆడుతుంది. అయితే మోనాల్ కూడా అవినాష్ కు ఏమి తక్కువ తీసిపోదని ప్రూవ్ చేసింది. ఇదిలాఉంటే ఈ వారం ఈ ఇద్దరిలోనే ఒకరు ఎలిమినేట్ అవుతారని తెలుస్తుండగా లీకైన వార్తల ప్రకారం అవినాష్, మోనాల్ లలో అవినాష్ సేఫ్ అయ్యి మోనాల్ ఎలిమినేట్ అయినట్టు తెలుస్తుంది. ఇద్దరికి పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ తక్కువ రాగా ఇద్దరిలో మోనాల్ కు తక్కువ ఓట్లు వచ్చినట్టు తెలుస్తుంది.

అయితే అవినాష్ ఈ వారం సేఫ్ అయినా కూడా నెక్స్ట్ వీక్ కూడా రిక్స్ లో ఉండే ఛాన్స్ ఉంది. తప్పకుండా అవినాష్ 14వ వారం కూడా ఇదే రకమైన ఒత్తిడి ఎదుర్కుంటాడని చెప్పొచ్చు. అవినాష్ 13వ వారం సేఫ్ అని తెలుస్తుంది. అయితే అది నిజమా కాదా అన్నది ఆదివారం ఎపిసోడ్ లో తెలుస్తుంది.                            

మరింత సమాచారం తెలుసుకోండి: