బిగ్ బాస్ సీజన్ 4లో మొదటి ఫైనలిస్ట్ గా అఖిల్ మెడల్ అందుకున్నాడు. గురు, శుక్రవారాల్లో బిగ్ బాస్ ఇచ్చిన టికెట్ టు ఫినాలే టాస్క్ లో భాగంగా అఖిల్ మొదటి ఫైనలిస్ట్ గా మెడల్ దక్కించుకున్నాడు. అయితే మొదటి ఫైనలిస్ట్ గా వచ్చిన అఖిల్ సీజన్ 4 విజేతగా నిలిచే అవకాశాలు ఉన్నాయా అన్నది తెలియాల్సి ఉంది. ముఖ్యంగా తనకు ఈ ఫైనలిస్ట్ గా వెళ్లేందుకు సహకరించిన సోహెల్ కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. అఖిల్ తోనే మంచిగా ఉంటూ ఆటలో కొన్ని సార్లు అతను చేసిన త్యాగం ప్రేక్షకులకు దగ్గరయ్యేలా చేసింది.

అఖిల్ కు టాప్ 5లో ఛాన్స్ ఇచ్చి తను కప్ గెలిచేలా ఉన్నాడు సోహెల్. అయితే సోహెల్ తో పాటుగా టాప్ 3లో అభిజిత్ కు ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ముఖ్యంగా బయట అతని ఫాలోయింగ్ చూస్తే షాక్ అయ్యేలా ఉంది. ప్రతివారం అతను నామినేషన్స్ లో ఉండటమే అతనికి ఈ ఫాలోయింగ్ వచ్చేలా చేసిందని అనిపిస్తుంది. అభిజిత్ కూడా టైటిల్ విన్నర్ అయ్యే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఫిజికల్ టాస్కుల్లో వీక్ అనుకున్నా హౌజ్ లో ఎలాంటి ఎమోషన్స్ కు బెండ్ అవకుండా ఉన్నందుకు అభిజిత్ విజేత అయ్యేందుకు అర్హుడని అంటున్నారు.

అయితే విజేత ఎవరన్నది ఈ ముగ్గురిలోనే ఉండే ఛాన్స్ ఉంది. అవినాష్ ఈ వారం సేఫ్ అయ్యేలా పరిస్థితులు కబడుతున్నా నెక్స్ట్ వీక్ కూడా డేంజర్ జోన్ లో ఉన్నట్టే. హారిక, అరియానాలతో పోటీ పడి అవినాష్ టాప్ 5లో ఉండగలడా అన్నది డౌటే అని చెప్పొచ్చు. మొత్తానికి అఖిల్ ఫైనలిస్ట్ గా చేరినా మిగతా హౌజ్ మేట్స్ నుండి గట్టి పోటీ వస్తుందని మాత్రం చెప్పొచ్చు.                       

మరింత సమాచారం తెలుసుకోండి: