పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమా వకీల్ సాబ్. పవన్ కు అభిమాని అయిన వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి నిర్మిస్తున్నారు. ఇటీవల పవన్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ తో పాటు అంతకముందు రిలీజ్ అయిన మగువ మగువ సాంగ్ కూడా ప్రేక్షకాభిమానులు నుండి మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి.

ఇక ఇటీవల ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ పూర్తి కాగా, తదుపరి షెడ్యూల్ ని జనవరిలో జరుపనున్నట్లు టాక్. పవన్ కళ్యాణ్ లాయర్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఆయనకు జోడీగా శృతి హాసన్ నటిస్తుండగా ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ ని, పీఎస్ వినోద్ ఫోటోగ్రఫిని అందిస్తున్నారు. తొలిసారిగా పవర్ స్టార్ తో నిర్మిస్తున్న సినిమా కావడంతో నిర్మాత దిల్ రాజు ఈ సినిమా విషయమై ప్రతి అంశంలోనూ ఎంతో శ్రద్ధ కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. ఇటు సినిమాల తో పాటు అటు తన జనసేన పార్టీ కార్యకలాపాల్లో కూడా పాల్గొంటున్న పవర్ స్టార్ వకీల్ సాబ్ ని వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. నిజానికి ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ మొన్న దీపావళికి రిలీజ్ అవుతుందని భావించిన పవన్ ఫ్యాన్స్ ఆశలు అడియాశలయ్యాయి.

అలానే వకీల్ సాబ్ కి సంబంధించి చాలా రోజులుగా ఒక్క అప్ డేట్ కూడా రాకపోవడంతో వారు దర్శక నిర్మాతలపై కొంత అసంతృప్తిని వ్యక్తపరుస్తూ సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు. ఒక రకంగా వకీల్ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారని, ఇక సినిమా టీజర్ కోసం వారు పడుతున్న ఆరాటం వర్ణనాతీతం అని అంటున్నారు విశ్లేషకులు. మరి ఇప్పటికైనా ఈ సినిమా యూనిట్ పవన్ ఫ్యాన్స్ ఆవేదనని గుర్తించి వకీల్ సాబ్ కి సంబంధించి ఏదైనా అప్ డేట్ ఇస్తుందేమో చూడాలి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: