బాలీవుడ్‌ హీరోలు ఎంత ప్రయత్నం చేసినా వర్కవుట్ కావడం లేదు. ప్రతీ సారీ ఫెయిల్యూరే ఎదురవుతోంది. కానీ సౌత్‌ హీరోలు మాత్రం బీటౌన్‌ని రఫ్ఫాడిస్తున్నారు. ముంబయి బాబులు తడబడిన చోట, సౌత్‌ స్టార్లు సత్తా చాటుతున్నారు. సౌత్‌ స్టార్స్ ప్రభాస్‌, యశ్‌కి బాలీవుడ్‌లో ఫుల్‌ ఫాలోయింగ్ వస్తోంది. 'బాహుబలి' సినిమాతో బీటౌన్‌లో అడుగుపెట్టిన ప్రభాస్‌కి ముంబయి మాహిష్మతి సామ్రాజ్యంలా మారిపోయింది. ఇక బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ అయితే ఈ హీరోని యువరాజులా‌ ట్రీట్ చేస్తోంది. అందుకే ప్రభాస్ కంప్లీట్ యాక్షన్‌ మూవీ 'సాహో'కి తెలుగు కంటే నార్త్‌లోనే ఎక్కువ రెస్పాన్స్‌ వచ్చింది.

'కెజిఎఫ్'తో ముంబయిలో అడుగుపెట్టిన కన్నడ స్టార్ యశ్‌కి అక్కడి బాక్సాఫీస్ సలామ్ కొట్టింది. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈ కంప్లీట్ యాక్షన్ స్టోరీకి నార్త్‌ ఆడియన్స్‌ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. యశ్‌కి సెపరేట్‌ ఫాలోయింగ్ కూడా క్రియేట్ అయింది. ఈ ఫాలోయింగ్‌తోనే 'కెజిఎఫ్2' టీజర్‌కి నార్త్‌లో భారీ రెస్పాన్స్ వచ్చింది.

ప్రభాస్, యశ్‌ ఇద్దరూ నార్త్‌లో మాస్‌ స్టోరీస్‌తో అదరగొడుతున్నారు. వీళ్లని ఇన్సిపిరేషన్‌ తీసుకొని చాలామంది స్టార్లు మాస్‌ మూవీస్‌తో బాలీవుడ్‌కి వెళ్తున్నారు. పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో విజయ్ దేవరకొండ 'ఫైటర్' సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెడుతున్నాడు. ఇక బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 'ఛత్రపతి' రీమేక్‌తో బాలీవుడ్‌లో లాంచ్ అవుతున్నాడు.

లవ్‌ స్టోరీస్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌ చుట్టూ ఎక్కువగా తిరిగే బాలీవుడ్‌లో ఇప్పుడు మాస్‌ మూవీస్‌కి ఫాలోయింగ్ పెరుగుతోంది. ఈ క్రేజ్‌తోనే సౌత్‌ స్టార్లు నార్త్‌లో హంగామా చేస్తున్నారు. దీంతో బాలీవుడ్‌ స్టార్స్‌ కూడా మాస్‌ ఇమేజ్‌ కోసం పోరాడుతున్నారు. కానీ వాళ్లకీ జానర్ సెట్ కాట్లేదు. మరి మన హీరోలు గెలిచిన చోట వాళ్లెందుకు సక్సెస్‌ కాలేకపోతున్నారు.

బాలీవుడ్‌ హీరోలు మాస్‌ హిట్స్‌ కోసం చాలా కష్టపడుతున్నారు. రణ్‌వీర్‌ సింగ్, వరుణ్‌ ధావన్, నుంచి  మొదలుపెడితే టైగర్‌ష్రాఫ్ వరకు అందరూ కంప్లీట్‌ కమర్షియల్‌ సబ్జెక్ట్స్‌తో బ్లాక్‌బస్టర్‌ కొట్టాలని ట్రై  చేస్తున్నారు. నార్త్‌లో మాస్‌ కథలు రాయలేకపోతున్నారని, ఇక్కడి నుంచి స్టోరీస్‌ కూడా తీసుకెళ్తున్నారు. అయితే వీళ్లు రీమేకులు చేసినా, మాస్ డైలాగులు చెప్పినా, బాక్సాఫీస్ మాత్రం ఎంటర్‌టైన్‌ చేయడం లేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: