ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...ఎనర్జిటిక్ స్టార్ రామ్ "ఇష్మార్ట్ శంకర్" సినిమాతో పెద్ద ఘన విజయం సాధించాడు.మంచి మాస్ హిట్ అందుకున్నాడు. ఆ సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకొని  కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘రెడ్’ సినిమా చేశాడు. ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రీరిలీజ్ ఈవెంట్ ని నిర్వహించడం జరిగింది. ఈ వేడుకకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ముఖ్య అతిథిగా హాజరు అయ్యాడు.ఈ వేడుకను ఎంతో గ్రాండ్ గా నిర్వహించారు. చివర్లో ముఖ్య అతిథికి ఫస్ట్ డే ఫస్ట్ షో బిగ్ టికెట్ ని ఇచ్చారు.

ఈ బిగ్ టికెట్ కు ఉన్న కవర్ ను త్రివిక్రమ్ ఓపెన్ చేయగానే.. అందరూ ఆశ్చర్యపడ్డారు.ఎందుకంటే అది ‘క్రాక్’ సినిమా టికెట్. జనవరి 9వ తేదీతో టికెట్ ఉంది. తప్పుని గ్రహించిన ఈవెంట్ ఆర్గనైజర్ శ్రేయాస్ మీడియా అదే టికెట్ పై ‘రెడ్’ సినిమా స్టిక్కర్ ను అతికించి ఇవ్వటం జరిగింది. అయితే ఈ విషయంపై సోషల్ మీడియాలో చాలా ట్రోల్ల్స్  వచ్చాయి. ఇంత పెద్ద ఈవెంట్ చేసినప్పుడు ఆ మాత్రం చూసుకోలేరా..? అంటూ అభిమానులు మండిపడ్డారు. మరికొందరు ‘క్రాక్’ సినిమాకి ఫ్రీ ప్రమోషన్ అంటూ ట్రోల్ల్స్ చేస్తున్నారు. ఈ ట్రోలింగ్ పై స్పందించిన హీరో రామ్ ఒక ట్వీట్ చేశారు.



ఈవెంట్ ని మరపురాని జ్ఞాపకంగా మార్చినందుకు త్రివిక్రమ్ కి కృతజ్ఞతలు చెప్పారు.అభిమానులకు, మీడియాకు స్పెషల్ థాంక్స్ చెప్పారు. చివరగా శ్రేయాస్ మీడియాను ఉద్దేశిస్తూ.. అప్పుడప్పుడు తప్పులు జరుగుతాయి.. ఏం పర్వాలేదు.. ఇప్పటికీ మీరే బెస్ట్ అంటూ పేర్కొన్నాడు. దీనిపై స్పందించిన శ్రేయాస్ శ్రీనివాస్.. ‘రెడ్’ సినిమాలో భాగం కావడం సంతోషంగా ఉందని అన్నారు. మీరు అమేజింగ్ హీరో మాత్రమే కాదు… అందరినీ ప్రేమించే వ్యక్తి కూడా అంటూ రామ్ పై తన ప్రేమను వ్యక్తం చేశారు.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: