ఈ మద్య కాలంలో తమిళ స్టార్ హీరో ఇళయ థలపతి విజయ్ నటించిన "మాస్టర్ " సినిమా పై ఎవరు ఊహించని విధంగా పాన్ ఇండియా వైడ్ గా అంచనాలు నెలకొన్నాయి. ఎందుకంటే దీపావళి కానుకగా వచ్చిన ఈ సినిమా యొక్క టీజర్ ఎలాంటి సంచలనలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా యొక్క టీజర్ భారీ వ్యూస్ రాబట్టడంతో అన్నీ ఇండస్ట్రీలలో ఈ సినిమా పై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఎప్పుడో విడుదల కావలసిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు సంక్రాంతి కానుకగా ఈ సినిమా నేడు విడుదలైంది.

సినిమా ను 100 శాతం ఆక్యుపెన్సీ తో విడుదల చెయ్యడానికి ప్రభుత్వం ముందు పర్మిషన్ ఇచ్చిన మళ్ళీ కోర్ట్  ఆదేశాలతో 50 ఆక్యుపెన్సీ నే ప్రభుత్వం  కేటాయించింది. ఇక ఈ సినిమాలో సైకాలజీ ప్రొఫెసర్‌గా విజయ్ స్టైలిష్ గా కనిపించాడు. తన మార్క్ యాక్టింగ్ తో విజయ్ అలరించడనే చెప్పాలి. విజయ్ కొత్త తరహా పాత్ర కావడంతో విజయ్ అబిమానుల నుండి ఈ సినిమాకు భారీ స్పందన లభిస్తుంది. అదే విధంగా నెగిటివిటీ కూడా అంతే స్థాయిలో స్ప్రెడ్ అవుతుంది. సినిమా కంటే ట్రైలరే బాగుందంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

ప్రేక్షకుల అంచనాలను అందుకోవడం లో పూర్తిగా విఫలం అయ్యిందంటూ పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. టీజర్‌తో రికార్డులు సృష్టించిన సినిమా థియేటర్ల విషయానికొస్తే చతికిల పడింది. ప్రస్తుతం ఈ సినిమా ట్విటర్‌లో ట్రెండింగ్‌గా మారింది. మాస్టర్ డిసాస్టర్ అంటూ అభిమానులు తమ నిరాశను వ్యక్తం చేస్తున్నారు. సినిమాపై తాము పెట్టుకున్న అంచనాలన్నీ చల్లాచెదురయ్యాయని ప్రేక్షకులు అసహనం చూపారు. సినిమా ఫస్ట్ హాఫ్ బాగా ఉందని కానీ సెకండ్ హాఫ్ మాత్రం చాలా రొటీన్‌గా నత్తనడకన సాగిందని అంటున్నారు. సినిమాలో కొన్ని సన్నివేశాలు బాగున్నాయి కానీ ఓవరాల్ సినిమాత్రం అంతలేదని ప్రేక్షకులు తమ అభిప్రాయాలను తెలపుతున్నారు. అయినప్పటికి మొదటి రోజు విడుదలైన అన్నీ చోట్ల కూడా మంచి కలెక్షన్లు రాబట్టిందని సమాచారం. మరి మొదటి వారంలో సినిమా యొక్క కలెక్షన్స్ ఎలా ఉంటాయన్న దానిపై ఆసక్తి నెలకొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: